కొరమీను చేపల పులుసు.. ఈ ఒక్కటీ వేసి చేస్తే వదిలిపెట్టకుండా తింటారు!

samatha

30 April 2026

కొరమీను చేపల పులుసు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.

కొరమీను

అయితే ఇప్పుడు మనం కొరమీను చేపల పులుసు చాలా టేస్టీగా రావాలి అంటే ఏం చేయాలి. దీనిని చాలా సులభంగా ఇంటిలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

చేపల పులుసు తయారీ

కొరమీను చేపల పులుసు తయారు చేయడానికి కావాల్సిన ఆహారపదార్థాల విషయానికి వస్తే, చేపలు కేజీ, మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆనియన్స్, టమాటాలు, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర.

ఆహారపదార్థాలు

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా చేపలు తీసుకొని నీటుగా శుభ్రపరుచుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఆహారపదార్థాలు

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో పచ్చిమర్చి,  కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా పోపు చేసుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం వేసి బాగా మరగనివ్వాలి.

మసాలా

ఇప్పుడు మెంతులు, ధనియాలు, జీలకర్ర , రెండు ఎండు మిర్చీ తీసుకొని వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

ధనియాల పొడి

అలాగే మిక్సర్ తీసుకొని అందులో కాల్చిన ఆనియన్, రెండు టమాటాలు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

టమాట, ఆనియన్ మిశ్రమం

ఇప్పుడు మరుగుతున్న సూప్‌లో మిక్సీ పట్టుకున్న పౌడర్ వేయాలి. అలాగే చేపలు కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో ఆనియన్ టమాటా సూప్ వేయాలి. దీని వలన చేపల పులుసు మంచి రుచిగా ఉంటుంది. పదినిమిషాల తర్వాత కొత్తిమీర వేయాలి. అంతే చేపల పులుసు రెడీ.

కొరమీను చేపల పులుసు రెడీ