AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌కు లవర్‌గా.. మహేష్ బాబుకు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమాలకు దూరంగా..

ఒక హీరో పక్కన హీరోయిన్‌గా నటించిన అమ్మాయి.. మరో సినిమాలో అదే హీరోకు లేదా మరో హీరోకు చెల్లెలిగా, అక్కగా నటించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. అలా ఓ సినిమాలో పవన్ కల్యాణ్ కు ప్రియురాలిగా నటించిన ఓ స్టార్ హీరోయిన్ మరో సినిమాలో మహేష్ బాబుకు అక్కగా నటించింది.

పవన్‌కు లవర్‌గా.. మహేష్ బాబుకు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమాలకు దూరంగా..
Pawan Kalyan, Mahesh Babu
Basha Shek
|

Updated on: May 01, 2026 | 6:15 PM

Share

పవన్ కల్యాణ్, మహేష్ బాబు.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలుగా వెలుగొందుతోన్న వీరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరేమో పవర్ స్టార్ గా అభిమానుల మన్ననలు అందుకుంటుంటే మరొకరు సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోయాడు. అయితే గతంలోలా పవన్ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు. మరోవైపు మహేష్ బాబు మాత్రం ది గ్రేట్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమాతో బిజీగా ఉంటున్నాడు. పవన్ కల్యాణ్, మహేష్ బాబుల పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. బాలీవుడ్ అందాల తారలు సైతం వీరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా పవన్, మహేష్ బాబు లు ఇప్పటివరకు ఎంతో మంది అందాల తారలతో రొమాన్స్ చేశారు. అమిషా పటేల్, భూమిక, శ్రుతి హాసన్, ఇలియానా, పార్వతి మెల్టన్, త్రిష, తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితర హీరోయిన్లు పవన్, మహేష్ లిద్దరితోనూ సినిమాలు చేశారు. అయితే ఓ సినిమాలో పవన్ కల్యాణ్ కు ప్రియురాలిగా నటించిన ఓ హీరోయిన్, కొన్నేళ్ల తర్వాత మరో సినిమాలో మహేష్ బాబుకు అక్కగా నటించింది. ఇలా టాప్ స్టార్స్ తో రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించిన ఏకైక హీరోయిన్ ఈ అమ్మడే కావడం విశేషం. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు?

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రం తొలి ప్రేమ. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. అను పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. దీని తర్వాత ప్రేమించే మనసు, రావోయి చందమామ తదితర సినిమాలు చేసింది కీర్తి. అలాగే పలు హిందీ, కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. దీంతో మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో హీరో అక్క పాత్రలో నటించిందీ కీర్తి. మీనాక్షి పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో కీర్తి నటనకు ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా వచ్చింది.

కీర్తి రెడ్డి ఇప్పుడిలా..

సినిమాల సంగతి పక్కన పెడితే .. అక్కినేని హీరో సుమంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కీర్తి రెడ్డి. అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తరువాత కీర్తి రెడ్డి మరొకరిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిలైందని సమాచారం. ప్రస్తుతం ఈ అందాల తార సినిమాలతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!