AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: స్టార్ హీరో అవ్వాల్సినోడు.. కానీ.. ఈ జబర్దస్త్ కమెడియన్‌ను గుర్తు పట్టారా? తెరపై కనిపిస్తే నవ్వులే

సినిమా కెరీర్ ఆరంభంలో ఈ నటుడి బాడీ పర్సనాలిటీ, హెయిర్ స్టైల్ చూస్తే కచ్చితంగా స్టార్ హీరో అవ్వాల్సిన వాడు అనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే వందలాది సినిమాల్లో నటించాడు. కానీ చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు. అయితే ఇప్పుడు బుల్లితెరపై దుమ్మురేపుతున్నాడు.

Jabardasth: స్టార్ హీరో అవ్వాల్సినోడు.. కానీ.. ఈ జబర్దస్త్ కమెడియన్‌ను గుర్తు పట్టారా? తెరపై కనిపిస్తే నవ్వులే
Jabardasth Comedian
Basha Shek
|

Updated on: Apr 30, 2026 | 9:46 AM

Share

పై ఫొటోలో ఉన్న యువకుడిని గుర్తు పట్టారా? చూస్తుంటేనే ఎవరో స్టార్ హీరో టీనేజ్ ఫొటో అనిపిస్తుంది కదా? అలా అనుకుంటూనే అతనూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. నటుడిగా వందలాది చిత్రాల్లో మెరిశాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ తదితర స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే అన్నీ సైడ్ క్యారెక్టర్లే. దీంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే ఇప్పుడీ నటుడు బుల్లితెరపై అదరగొడుతున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్ లో తన దైన కామెడీ, గెటప్పులతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా నటించినా రానీ గుర్తింపు ఒక్క జబర్దస్త్ కామెడీ షోతో సొంతం చేసుకున్న ఈ కమెడియన్ మరెవరో కాదు గడ్డం నవీన్. పై ఫొటోలు అతని టీనేజ్ నాటివి.

నవీన్ 1997లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. చాలా సినిమాల్లో నటించారు. అప్పట్లో ఒత్తైన జుట్టుతో.. సూపర్ హెయిర్ స్టైల్‌తో నిజంగానే స్టార్ హీరోలా కనిపించాడు నవీన్. అయితే సినిమాల్లో ఎక్కువగా ఆయనకు సైడ్ క్యారెక్టర్ రోల్స్ రావడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. రామసక్కనోడు, ఆది, ఇష్టం, 16 టీన్స్, ఇడియట్, బ్యాడ్ బాయ్స్ తదితర హిట్ సినిమాల్లో నటించాడు నవీన్. ఎక్కువగా విలన్ గ్యాంగ్స్ లోనే కనిపించారీ నటుడు. కాగా జబర్ధస్త్ తర్వాతే తనకు మంచి గుర్తింపు వచ్చిందంటారు నవీన్.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ గడ్డం నవీన్ ఫొటోస్..

‘హీరో అవుదామనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. కృష్ణ, చిరంజీవిలకు నేను పెద్ద ఫ్యాన్. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. అందరిలా సినిమా ఆఫీస్ ల చుట్టూ అవకాశాల కోసం తిరిగాను. కానీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఎక్కువగా వచ్చాయి.  ఆ తర్వాత విలన్ గ్యాంగ్స్ లో ఎక్కువగా నటించాను. అయితే జబర్ధస్త్ ఎంట్రీ తర్వాతే నాకు  గుర్తింపు లభించింది. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి , అదిరే అభి, చలాకీ చంటి వాళ్ల వల్ల నాకు జబర్ధస్త్ లోకి ఎంట్రీ దొరికింది. ఇక అదిరే అభి అన్న ప్రోత్సాహంతో మరిన్ని అవకాశాలు దక్కాయి. వారికి ఎప్పటికి రుణపడి ఉంటాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు గడ్డం నవీన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.5 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ బడ్జెట్ కార్లు!
రూ.5 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ బడ్జెట్ కార్లు!
నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం..
నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం..
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ఫేజ్ 1 పూర్తికి..
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ఫేజ్ 1 పూర్తికి..
Gen Z కి బాగా నచ్చేస్తున్న అమ్మమ్మ,అమ్మల నాటి హెయిర్ స్టైల్స్ ఇవి
Gen Z కి బాగా నచ్చేస్తున్న అమ్మమ్మ,అమ్మల నాటి హెయిర్ స్టైల్స్ ఇవి
రుతురాజ్, షేక్ రషీద్‌ను కాదని సర్ఫరాజ్‎కే ఛాన్స్ ఎందుకంటే?
రుతురాజ్, షేక్ రషీద్‌ను కాదని సర్ఫరాజ్‎కే ఛాన్స్ ఎందుకంటే?
అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు
అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు
5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!
5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!
ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే..
ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే..
మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నారా
మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నారా
విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్..
విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్..