AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే

బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సంగీత్ శోభన్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ రాకాస, శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ ఓటీటీలోకి వచ్చేశాయి. శుక్రవారం (మే 01) అర్దరాత్రి నుంచే ఈ రెండు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
OTT Movies
Basha Shek
|

Updated on: May 01, 2026 | 10:14 AM

Share

ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాక్సాఫీస్ గా దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన రెండు సూపర్ హిట్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అవి కూడా సేమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే నవ్వించి భయపెట్టింది. అలాగే కలెక్షన్ల పరంగానూ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 27 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. లేడీ డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 1) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అమెరికా నుంచి పెళ్లి కోసం సొంతూరికి వచ్చిన ఓ యువకుడు, అనుకోకుండా ఆ ఊరి కోటలో ఉన్న ‘బ్రహ్మ రాక్షసుడి’కి బలిగా వెళ్లాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైందన్నదే ఈ సినిమా కథ. హారర్ అంశాలకు తోడు వినోదం పుష్కలంగా ఉండటంతో ఓటీటీ లవర్స్ కు ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇక యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన పక్కా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బైకర్’. ఇండియాలోనే మొట్టమొదటి ‘మోటోక్రాస్ రేసింగ్’ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఈమూవీలో మరో కీలక పాత్ర పోషించారు. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటించింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కూడా శుక్రవారం నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగు తో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

రెండూ నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.5 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ బడ్జెట్ కార్లు!
రూ.5 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ బడ్జెట్ కార్లు!
నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం..
నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం..
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ఫేజ్ 1 పూర్తికి..
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ఫేజ్ 1 పూర్తికి..
Gen Z కి బాగా నచ్చేస్తున్న అమ్మమ్మ,అమ్మల నాటి హెయిర్ స్టైల్స్ ఇవి
Gen Z కి బాగా నచ్చేస్తున్న అమ్మమ్మ,అమ్మల నాటి హెయిర్ స్టైల్స్ ఇవి
రుతురాజ్, షేక్ రషీద్‌ను కాదని సర్ఫరాజ్‎కే ఛాన్స్ ఎందుకంటే?
రుతురాజ్, షేక్ రషీద్‌ను కాదని సర్ఫరాజ్‎కే ఛాన్స్ ఎందుకంటే?
అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు
అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు
5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!
5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!
ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే..
ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే..
మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నారా
మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నారా
విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్..
విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్..