AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bellamkonda Sai Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం.. అసలు ఎవరీ కావ్యా రెడ్డి? ఆసక్తికర విషయాలు మీకోసం

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టనున్నాడు. కావ్య అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు?. మరి అసలు ఎవరీ కావ్య? ఇద్దరికి ఎలా పరిచయం?తదితర విషయాలు తెలుసుకుందాం రండి.

Bellamkonda Sai Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం.. అసలు ఎవరీ కావ్యా రెడ్డి? ఆసక్తికర విషయాలు మీకోసం
Bellamkonda Sai Sreenivas
Basha Shek
|

Updated on: Apr 30, 2026 | 4:26 PM

Share

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్   ఒక ఇంటివాడు అయ్యాడు. బ్యాచిలర్ లైప్ కు బై బై చెబుతూ కావ్యా రెడ్డి అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. బుధవారం (ఏప్రిల్ 29) తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరైన నూతన దంపతులను  ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్- కావ్యా రెడ్డిల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు,  శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా   మే 01న హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ పెళ్లి వేడుక నేపథ్యంలో అసలు కావ్యా రెడ్డి ఎవరు? బెల్లం కొండ శ్రీనివాస్ తో ఆమె ఎలా పరిచయం? వీరిది ప్రేమ వివాహమా? లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా? అన్న అంశాలపై నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.  ఈ నేపథ్యంలోనే కావ్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..

బెల్లంకొండ శ్రీనివాస్ ను మనువాడబోయే కావ్యా రెడ్డికి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఒక ప్రముఖ న్యాయవాది కుమార్తె. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల విషయంలో వారి ఏజ్ గ్యాప్ పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 1993లో జన్మించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. అయితే కావ్యా రెడ్డి హీరో కంటే సుమారు నాలుగు నుంచి ఐదు ఏళ్లు చిన్నదని సమాచారం. అంటే ఆమె వయస్సు దాదాపు 28 ఏళ్లు ఉండవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

 భార్య కావ్యా రెడ్డితో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us