AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: ‘ధురంధర్’ సినిమాలోని యలీనా జమాలీ పాత్ర నిజమేనా? ఇప్పటికీ ఆమె బతికే ఉందా?

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్' చిత్రంలో సారా అర్జున్ పోషించిన యలీనా జమాలీ పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పుడు పాత్ర పై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరగుతోంది. ఈ పాత్ర నిజమని కొందరి అంటుంటే మరికొందరు కల్పితమని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలుసుకుందాం రండి.

Dhurandhar 2: 'ధురంధర్' సినిమాలోని యలీనా జమాలీ పాత్ర నిజమేనా? ఇప్పటికీ ఆమె బతికే ఉందా?
Dhurandhar 2 Movie
Basha Shek
|

Updated on: Mar 25, 2026 | 7:26 PM

Share

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా ‘ధురందర్’, ‘ధురందర్: ది రివెంజ్’ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. రెండు సినిమాలు కలిపి రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. ఈ రెండు సినిమాల్లో 20 ఏళ్ల సారా అర్జున్, జమీల్ జమాలి కుమార్తె యలీనా జమాలీ పాత్రను పోషించింది. ఇందులో ఆమె అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు సారా అర్జున్ పాత్రపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. నిజ సంఘటనల ఆధారంగా ధురందర్ సినిమాలను తెరకెక్కించామని దర్శకుడు ఆదిత్య ధర్ పేర్కొన్న సంగతి తెలిపిందే. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో చాలా విషయాలను వాస్తవంగా చూపించారు. పాకిస్థాన్‌లోని ల్యారీ ఏరియా, భారతదేశంపై జరిగిన ఉగ్రవాద దాడులు తదితర నిజ జీవిత సంఘటనలను ఇందులో చూడవచ్చు. అలాగే ఈ చిత్రంలోని పాత్రలు కూడా నిజ జీవితంలో ఉన్న వ్యక్తుల ఆధారంగా రూపొందించినవే.

ధురంధర్ సినిమాలో రాకేష్ బేడీ పోషించిన జమీల్ జమాలీ పాత్ర తన జీవితం ఆధారంగానే తీశారని పాకిస్తానీ నటుడు నబీల్ గబోల్ పేర్కొన్నారు.దీని తర్వాత ఇప్పుడు జమీల్ జమాలి కుమార్తె యలీనా కథ కూడా నిజమేనా అనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చాలా మంది యలీనా కథను నబిల్ గాబోల్ కుమార్తె జీవితంతో ముడిపెడుతున్నారు. ‘ధురందర్’లో యలీనా ఒక భారతీయ గూఢచారిని వివాహం చేసుకుంటుంది. అందుకే, నబిల్ కుమార్తె ఎవరు, ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే నబిల్ గాబోల్ పిల్లల గురించి ఇంటర్నెట్‌లో సరైన సమాచారం ఏదీ అందుబాటులో లేదు. సినిమాలో జమీల్ జమాలి కుమార్తె యలీనాను చూపించారు. అయితే, నిజ జీవితంలో నబిల్‌కు కుమార్తెలు లేరని తెలిసింది.ఆయనకు ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారని తెలిసింది. అయితే నబిల్ గబోల్ అన్నయ్య కూతురు నాడియా గబోల్ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె ఒక సామాజిక కార్యకర్త. ‘ధురందర్’ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో నబిల్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో మా ఇంటి అమ్మాయి ఒక భారత గూఢచారిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఇదంతా కేవలం ఒక మసాలా సినిమా తీయడం కోసమే చూపించారు’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర