AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో అల్లు అర్జున్ సినిమా.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు.. ఏ మూవీనో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసిన కథలతో.. మరో హీరో సినిమా చేయడం సర్వ సాధారణం. మెగా హీరోల విషయంలో కూడా ఇది జరిగింది. మెగాపవన్ స్టార్ రామ్ చరణ్ కోసం ఓ కథ రాసుకుంటే.. ఆ సినిమాను అల్లు అర్జున్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే?

 రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో అల్లు అర్జున్ సినిమా.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు.. ఏ మూవీనో తెలుసా?
Ram Charan, Allu Arjun
Basha Shek
|

Updated on: Mar 24, 2026 | 8:55 PM

Share

రామ్ చరణ్, అల్లు అర్జున్.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతోన్న స్టార్ హీరోల్లో వీరు కూడా ఒకరు. సినిమా నేపథ్యమున్న కుటుంబాల నుంచి వచ్చినా వీరు అనతికాలంలోనే తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమదైన నటన, డ్యాన్స్ లు, ఫైట్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో బన్నీ పాన్ వరల్డ్ హీరో అయిపోయాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా రామ్ చరణ్ తన సినిమా కెరీర్ లో చాలా చిత్రాలను రిజెక్ట్ చేశాడు. కథలు తనకు సూట్ కావనో, స్క్రిప్ట సరిగా లేదోనో, డేట్స్ అడ్జెస్ట్ చేయకపోవడం వల్లనో చాలా సినిమాలను వదులుకున్నాడు. అలా రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన వాటిలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే మరికొన్ని హిట్ అయ్యాయి. అయితే అలా రామ్ చరణ్ రిజెక్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. ఆ సినిమా మరేదో కాదు స్టైలిష్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన రేసుగుర్రం.

అల్లు అర్జున్ హీరోగా 2014లో రిలీజైన రేసుగుర్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. బన్నీ సినిమా కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రవికిషన్ విలన్ గా నటించాడు. ఇక కిల్ బిల్ పాండే పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే ఈ సినిమా కథను మొదట రామ్ చరణ్ కోసం రాసుకున్నాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అయితే అదే సమయంలో రామ్ చరణ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట. దీంతో సురేందర్ రెడ్డి రేసుగుర్రం కథను అల్లు అర్జున్ కు వినిపించాడట. బ్రదర్ సెంటిమెంట్ బాగా ఉండడం, హీరో ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో బన్నీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అలా రేసుగుర్రం సినిమా పట్టాలెక్కి బన్నీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే రేసుగుర్రం సినిమాను మిస్ అయినప్పటికీ రామ్ చరణ్ తో ధ్రువ సినిమాను తీసి సాలిడ్ హిట్ అందుకున్నాడు సురేందర్ రెడ్డి. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి హిస్టారికల్ మూవీని కూడా తెరకెక్కించాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడీ క్రియేటివ్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర