AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divvala Madhuri: తిరుమలలో మరోసారి దివ్వల మాధురి అత్యుత్సాహం.. ఏం చేసిందో తెలుసా? వీడియో ఇదిగో

బిగ్ బాస్ ఫేమ్ దివ్వల మాధురి మరోసారి వార్తల్లో నిలిచింది. పవిత్రమైన తిరుమల కొండపై ఆమె చేసిన ఒక పని ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. దీనిపై శ్రీవారి భక్తులు కూడా మండిపడుతున్నారు. అదే సమయంలో టీటీడీ విజిలెన్స్ కూడా ఈ ఘటనపై ఆరా తీస్తోంది.

Divvala Madhuri: తిరుమలలో మరోసారి దివ్వల మాధురి అత్యుత్సాహం..  ఏం చేసిందో తెలుసా? వీడియో ఇదిగో
Divvala Madhuri
Basha Shek
|

Updated on: Mar 05, 2026 | 6:43 PM

Share

బిగ్ బాస్ ఫేమ్ దివ్వల మాధురి మరోసారి చిక్కుల్లో పడింది. గతంలో తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ తో కలసి రీల్స్ చేసిన మాధురిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. తాజాగా మరోసారి తిరుమలలో అలాంటి పనే చేసి ఇబ్బందుల్లో పడింది మాధురి. ఏడుకొండలపై గెస్ట్‌ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది మాధురి. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే.. తిరుమల కొండపైకి కేక్‌లు తీసుకెళ్లడం నిషేధం. మరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కొండపైకి మాధురి ఎలా బర్త్ డే కేక్ తీసుకెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీటీడీ విజిలెన్స్ కూడా ఆరా తీస్తోంది.  అంతకు ముందే వీరు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది.

గతంలోనూ..

కాగా గతంలోనూ ఇదే తిరుమల శ్రీవారి ఆలయం సాక్షిగా వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి దంపతులు. మాడ వీధుల్లో సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చేసి వాటిని నెట్టింట షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మాధురిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక లేటెస్ట్ గా తన క్లోజ్ ఫ్రెండ్, బిగ్ బాస్ విన్నర్ తనూజ కోసం  బర్త్ డే కేక్ తెప్పించి కట్ చేయించింది. అంతేకాదు తనూజకు చీర గాజులతో పాటు బంగారు కమ్మలను కూడా బహుమతిగా ఇచ్చింది.

తిరుమలలో తనూజ బర్త్ డే సెలబ్రేట్ చేస్తోన్న దివ్వెల మాధురి.. వీడియో

తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది దివ్వెల మాధురి. ‘హ్యాపీ బర్త్‌డే బంగారం.. మై స్వీట్‌ హార్ట్‌ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకొంటోన్న ఫస్ట్ బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను’ అని తనూజకు విషెస్ చెప్పింది. ఈ పోస్ట్ కు స్పందించిన తనూజ కూడా థ్యాంక్యూ మ్యాడీ అని రిప్లై ఇచ్చింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది మాధురి. మరి ఈ కాంట్రవర్సీపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

తిరుమలలో తనూజ, దివ్వెల మాధురి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే