AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌.. అనుమానాలు చాలానే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'పెద్ది'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈవిషయాన్ని శుక్రవారం (మే 01) అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే..

Peddi Movie: రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌.. అనుమానాలు చాలానే!
Peddi Movie
Basha Shek
|

Updated on: May 01, 2026 | 6:35 PM

Share

పెద్ది’ డేట్‌ అనౌన్స్ మెంట్‌ ఇలా వచ్చిందో లేదో, రకరకాల అనుమానాలు, చర్చలు ఇండస్ట్రీలో ఇన్‌స్టంట్‌గా వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్‌ హీరోగా, జాన్వీ హీరోయిన్‌గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కింది ‘పెద్ది’ మూవీ. ఈ సినిమా జూన్‌ 4న రిలీజ్‌ కానుంది. ‘ఆల్రెడీ చెప్పినట్టు ఏప్రిల్‌ 30న రాలేకపోయినందుకు క్షమించండి, జూన్‌ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి’ అంటూ డైరక్టర్‌ బుచ్చిబాబు సానా తన స్టైల్లో మూవీ రిలీజ్‌ డేట్‌ చెప్పేశారు. అయితే నిర్మాత వెంకట సతీష్‌ కిలారు మాట్లాడుతూ ‘జూన్‌ 4న సినిమా రిలీజ్‌ చేస్తాం. జూన్‌ 3న అన్ని చోట్లా ప్రీమియర్లు ప్రదర్శిస్తాం’ అని అన్నారు. తెలంగాణ ప్రీమియర్‌ షోలకు టిక్కెట్ రేట్లు పెంచుకోవాలంటే కచ్చితంగా ముందుగా అప్లై చేసుకోవాలి. మరి ‘పెద్ది’ విషయంలో అది జరిగే ఛాన్సులు ఇంకెక్కడివి? ఆల్రెడీ మే మొదలైపోయింది. జూన్‌ 3నే సినిమా ప్రీమియర్లు కావడంతో అప్లై చేసుకోవడానికి సమయం సరిపోదు. దీన్ని బట్టి ‘పెద్ది’ ప్రీమియర్లు రెగ్యులర్ రేట్లకే అందుబాటులోకి రానున్నాయా? అన్నది ఓ చర్చ.

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల పర్సంటేజీల విధానం మీద ఇప్పుడు గొడవ జరుగుతోంది. తమ చేతిలో ఉన్న మల్టిప్లెక్సుల్ని కూడా ‘జెట్లీ’కి ఇవ్వలేదు సింగిల్‌ స్క్రీన్స్ వారు. ఈ విధానాన్ని తప్పు పట్టేశారు మైత్రీ మూవీస్‌ తరఫున శశిధర్‌. సత్య హీరోగా నటించిన ‘జెట్లీ’ విషయంలోనే తమ పంథా ఏంటో చెప్పిన సింగిల్‌ స్క్రీన్స్ వారు, జూన్‌ 3న ‘పెద్ది’ విషయంలో ఎలా వ్యవహరిస్తారు? పర్సంటేజీలు తమకు వద్దని డిక్లేర్‌ చేసిన వారిలో వృద్ధి సినిమాస్‌ వెంకట సతీష్‌ కిలారు కూడా ఉండటం గమనార్హం. అలాంటప్పుడు ‘జెట్లీ’ సీన్‌ ‘పెద్ది’ విషయంలోనూ రిపీట్‌ అవుతుందా? లేకుంటే అప్పటికల్లా నైజామ్‌లో థియేటర్ల సమస్య ఓ కొలిక్కి వచ్చేస్తుందా? పెద్దిగాడిని మర్చిపోవడం అంత తేలిక కాదు. అందరి మనస్సుల్లోనూ నిలిచిపోతాడు అంటూ ‘పెద్ది’ మూవీ గురించి చెబుతూ ఊరిస్తున్నారు డైరక్టర్‌ బుచ్చిబాబు సానా. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ పెర్ఫార్మెన్స్ వేరే లెవల్‌.. రంగస్థలాన్ని మించి ఉంటుందని డిక్లేర్‌ చేసేశారు సుకుమార్‌. సినిమా అద్భుతం అంటూ తన మాటగా చెప్పేశారు సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు. వీరందరు చెప్పిన మాటలు విన్న చెర్రీ ఫ్యాన్స్ మాత్రం మా సినిమా జూన్‌ ఫస్ట్ వీక్‌లోనే వచ్చేస్తున్నందుకు మేం హ్యాపీ అని అంటున్నారు. హిందీలో భారీ రిలీజ్‌ ఉందని తెలిసి సో హ్యాపీ అంటున్నారు. అన్నట్టు పెద్ది మూవీని ఐదు భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us