EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న తప్పు చేస్తే మీ డబ్బులు రాకపోవచ్చు.. ఒకసారి చెక్ చేస్కోండి..
ప్రైవేట్ సంస్ధల్లో ఉద్యోగం చేసే చాలామందికి పీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. అయితే చాలమంది దీని గురించి పట్టించుకోడం మానేస్తారు. అవసరం వచ్చినప్నపుడు చూసుకోవచ్చులే అనుకుని వివరాలు చూసుకోరు. కానీ దీని వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. వివరాలు తప్పుగా ఎంట్రీ అయితే సమస్యల్లో పడతారు.

ఈపీఎఫ్‌వో అకౌంట్ ఉన్నవారు తెలిసి తెలియక చేసే చిన్న తప్పులు భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారవచ్చు. ఏదైనా కంపెనీలో చేరేటప్పుడు ఈపీఎఫ్‌వో ఖాతాలో జాయినింగ్, ఎగ్జిట్ డేట్ కరెక్ట్‌గా ఉండేలా చేసుకోవాలి. ఒకవేళ తప్పుగా నమోదు అయితే ఉంటే హెచ్‌ఆర్‌తో మాట్లాడి మార్చుకోవాలి. లేకపోతే మీ పీఎఫ్ సేవింగ్స్, విత్ డ్రా, పెన్షన్‌పై ప్రభావితం చూపుతాయి. మీ సర్వీస్ కాలంపై ఆధారపడి పెన్షన్, ఈపీఎఫ్‌వో విత్ డ్రాలు అనేవి ఉంటాయి. తప్పుగా నమోదు అవ్వడం వల్ల మీరు వాటిని పొందటంలో ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. అలాగే మీకు రావాల్సిన నిధులు కూడా నిలిచిపోవచ్చు.
సర్వీస్ కాలం ముఖ్యం
ఈపీఎఫ్‌వోకు మీ జీతం నుంచి కొంత మొత్తం కట్ చేసి చెల్లిస్తే.. యాజమాన్యం మీ వాటాకు మరికొంత కలుపుతుంది. ఇక పెన్షన్ స్కీమ్‌కు కూడా మరికొంత యాడ్ అవుతుంది. మీరు నెలవారీ చెల్లించే వాటాతో పాటు ఆ బ్యాలెన్స్‌పై వచ్చే వడ్డీ మీ సర్వీస్ కాలంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఉద్యోగంలో చేరిన తేదీ తప్పుగా ఎంట్రీ అయితే మీరు తక్కువ కాలం చేసినట్లు సిస్టమ్ గుర్తించింది. ఈ కారణంతో మీ పీఎఫ్ బ్యాలెన్స్ తక్కువగా ఉండటంతో పాటు వడ్డీ కూడా తగ్గుతుంది. ఇక ఉద్యోగం మానేసిన తేదీ తప్పుగా ఉంటే కంపెనీ నుంచి వచ్చే తర్వాతి చెల్లింపులు నిలిచిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందేందుకు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ కాలం పూర్తి చేసి ఉండాలి. దీంతో తప్పుగా వివరాలు ఎంటర్ కావడం వల్ల సర్వీస్ కాలం తగ్గవచ్చు. దీని వల్ల మీకు జీవితాంతం పెన్షన్ రాకపోవచ్చు.
ఎగ్జిట్ డేట్ చెక్ చేసుకోండి..
ఇక పీఎఫ్‌ను బదిలీ చేసుకునే సమయంలో లేదా విత్ డ్రా చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఉద్యోగం చేరిన, మానేసిన తేదీల ఆధారంగా పీఎఫ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వివరాలు సరిపోలకపోతే క్లెయిమ్ ఆలస్యం కావొచ్చు. ఇక తప్పుగా ఉండటం వల్ల రెండు ఉద్యోగాలు ఒకేసారి కనిపించడం లాంటివి చేసుకోవచ్చు. దీంతో మీ పీఎఫ్ సర్వీస్ హిస్టరీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల పొరపాట్లు జరగకుండా చూసుకోవచ్చు. తప్పులు ఉంటే యూఏఎన్ పోర్టల్ ద్వారా మీరు సరిచేసుకోవచ్చు. ఎగ్జిట్ తేదీని స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఉద్యోగం వదిలేసిన రెండు నెలల తర్వాత మీరే స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కంపెనీలు ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయడం మర్చిపోవచ్చు. అందుకే మీరే చేసుకోండి.
