AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకాకుళం స్టైల్ ఉలవకట్టు చారు .. ఇలా వండి తింటే బాడీ మొత్తాన్ని శుద్ది చేస్తుంది

Srikakulam Special Ulava Kattu Charu: శ్రీకాకుళం స్టైల్ ఉలవకట్టు చారు ఇలా వండి తింటే బాడీ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. సమ్మర్లో బెస్ట్ రెసిపీ ఇది. దీనిని అస్సలు మిస్ చేయకండి. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 06, 2026 | 12:58 PM

Share
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు ఉలవలు, రెండు ఉల్లిపాయలు,  రెండు పెద్ద టమోటాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 
పచ్చిమిర్చి,  రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు రసం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె.

కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు ఉలవలు, రెండు ఉల్లిపాయలు, రెండు పెద్ద టమోటాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు రసం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె.

1 / 5
తాలింపు కోసం.. అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  కరివేపాకు,   నాలుగు ఎండు మిర్చి, కొత్తిమీరను  తీసుకోవాలి. చివర్లో కొత్తిమీరను వేయడం అస్సలు మర్చిపోకండి. ఇది వేస్తే మంచి రుచి వస్తుంది.

2 / 5

ముందుగా ఉలవలను తీసుకుని వాటిని నీటిలో కడిగి ప్రెజర్ కుక్కర్‌లో బాగా ఉడికించాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  ఉలవకట్టును సెపరేట్ చేయాలి.

3 / 5
ఇప్పుడు పాన్ లో ఆయిల్ చేసి వేడి చేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు , వెల్లుల్లిరెబ్బలు , పచ్చిమిర్చిని వేసి  గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు  బాగా వేయించాలి.

4 / 5
టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు వాటిని ఉడికించాలి. ఇక ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉలవకట్టు, రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు రసం కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి వాటిని బాగా మరిగించాలి.  చివర్లో కొత్తిమీరను వేసి చల్లి దింపాలి.

5 / 5
Follow Us