నిజామాబాద్ జిల్లా కల్లాడి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బాన్సవాడకు చెందిన అఖిల అనే నవవధువు వివాహం జరిగిన నెల రోజులకే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మార్చి 5న శ్రీకాంత్తో ఆమెకు వివాహం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.