వాల్‌నట్ Vs బాదం.. ఏది ఎక్కువ మంచిది?
వాయిస్ మన శరీరంలోని అన్ని కార్యకలాపాలను నియంత్రించే ప్రధాన అవయవం మెదడు. అందుకే మెదడు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మంచి జీవనశైలి, సరైన ఆహారం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరచవచ్చు. వాల్‌నట్‌లు, బాదంపప్పులు వంటి డ్రైఫ్రూట్స్ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వాల్‌నట్‌లు మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి. ఇవి అభిజ్ఞా సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజూ లేదా వారానికి కొన్ని సార్లు వాల్‌నట్‌లు తినే పిల్లలు, యువతలో ఏకాగ్రత మెరుగుపడింది. ప్రత్యేకంగా వాల్‌నట్‌లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ (ALA) మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే నాడీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. బాదంపప్పులు కూడా మెదడుకు చాలా మంచివి. వీటిలో విటమిన్ E, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును రక్షించడంలో, శరీరానికి శక్తినివ్వడంలో సహాయపడతాయి. బాదం పప్పులు ముఖ్యంగా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను అందించడంలో ఉపయోగపడతాయి. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
మరిన్ని వీడియోల కోసం :
నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
రామాయణ టీజర్ అంచనాలను అందుకుందా?
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
మోమోస్ తిన్న బాలికకులివర్ డ్యామేజ్.. చివరకు..!
కస్టమర్ కు రూ.3.21 లక్షల.. పరిహారాన్ని చెల్లించిన బ్యాంక్ !!
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. కట్ చేస్తే

