AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB New Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ పలు రాత పరీక్షల తేదీల్లో మార్పులు! కొత్త షెడ్యూల్‌ ఇదే

ఇండియన్ రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి త్వరలో జరగనున్న రాత పరీక్షల తేదీలను భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) మార్చింది. ఈ మేరకు బోర్డు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన పాత షెడ్యూల్‌..

RRB New Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ పలు రాత పరీక్షల తేదీల్లో మార్పులు! కొత్త షెడ్యూల్‌ ఇదే
RRB Paramedical New Exam Dates
Srilakshmi C
|

Updated on: Feb 27, 2026 | 6:18 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి త్వరలో జరగనున్న రాత పరీక్షల తేదీలను భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) మార్చింది. ఈ మేరకు బోర్డు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన పాత షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10, 11, 12 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పు చేసిన ఆర్‌ఆర్‌బీ ఒక రోజు ముందుకు ఆయా తేదీలను మార్పు చేసింది.

కొత్త షెడ్యూల్‌ ప్రకారం మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్‌ఆర్‌బీ పారామెడికల్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు అభ్యర్ధులు మారిన తేదీలను గమనించాలని తదనుగుణంగా తమ ప్రిపరేషన్‌ సాగించాలని ఆర్‌ఆర్‌బీ తన ప్రకటనలో తెలిపింది. పరీక్షకు10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేయనుంది. అలాగే 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు ఆర్‌ఆర్‌బీ తెలిపింది. ఆయా తేదీల్లో రోజుకు మూడు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 434 పోస్టులకు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ పరీక్షలు తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాల రాత పరీక్షల పూర్తి షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

కాగా తాజాగా పారా మెడికల్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసిన ఆర్‌ఆర్‌బీ.. ఆర్‌ఆర్‌బీ రైల్వే క్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్), టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుల తేదీలను కూడా మారుస్తూ ప్రకటన వెలువరించింది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 6, 9, 10, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించింది. జనవరిలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. మారిన తేదీలను అభ్యర్ధులు గమనించాలని, ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్