Rain Alert: బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది.. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు, వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది.. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు, వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే 5 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు చేసింది.. రాగల మూడు గంటల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతోపాటు.. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తయని పేర్కొంది.
భారీ వర్షం.. నీట మునిగిన పంట..
పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురవడంతో జిల్లాలోని పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా దేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. అకాల వర్షానికి గౌరీపట్నంలో ఆరబెట్టిన మొక్కజొన్న, ధాన్యం నీటి పాలైంది. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు, పూర్తిగా తడిపోయిన మొక్కజొన్న, ధాన్యం చూపిస్తూ అన్నదాత కన్నీటి పర్యంతం అయ్యాడు.. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు కళ్లముందే పాడైపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
పెరుగుతున్న సమ్మర్ హీట్
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హీట్ క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి చేరుతున్నాయి. భానుడి భగభగతో ప్రజలు వాహనదారులు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు నమోదవుతుండడం షాకిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు కూడా క్రాస్ అవుతుండడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
