మునగ చెట్టులో ప్రతి భాగం ఒక ఔషధమే. మునగ ఆకులు, కాయల ఉపయోగాలు అందరికీ తెలిసినవే. కానీ, మునగ గింజలు (Moringa Seeds) కూడా మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
మునగ విత్తనాలు పోషకాల గని. ఇందులో విటమిన్-సి, విటమిన్-ఎ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
మధుమేహ నివారణ: రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి మునగ విత్తనాలు సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఒక మంచి సహజ సిద్ధమైన ఔషధం.
గుండె ఆరోగ్యం: ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలోని జింక్ మరియు ఐరన్ రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.
బలమైన ఎముకలు: కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి ఇది గొప్ప ఉపశమనం.
చర్మం, జుట్టు: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. జుట్టు రాలడం తగ్గించి, కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
మెరుగైన నిద్ర: నిద్రలేమితో బాధపడేవారు మునగ విత్తనాలను తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎలా తీసుకోవాలి?:మునగ విత్తనాలను ఎండబెట్టి పౌడర్ రూపంలో లేదా విత్తనాలను నేరుగా (పైన ఉన్న పొట్టు తీసివేసి) తీసుకోవచ్చు. రోజుకు 2-3 గింజలు లేదా ఒక చిన్న స్పూన్ పౌడర్ సరిపోతుంది.