భర్తతో విడిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ఆమని..

Rajitha Chanti

Pic credit - Instagram

27 April 2026

నటి ఆమని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘శుభలగ్నం’, ‘మిస్టర్ పెళ్లాం’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది.

ఇటీవల బుల్లితెరపై ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌తో బిజీగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, భర్త ఖాజా మొయుద్దీన్‌తో విడిపోవడంపై స్పందించారు. 

చాలా కాలంగా ఆమని తన భర్త నుంచి ఎందుకు విడిపోయారు? గతంలో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారంటూ వచ్చిన వార్తల్లో నిజమెంత? అనే సందేహాలకు ఆమె క్లారిటీ ఇచ్చారు. 

తమది ప్రేమ వివాహం కాదని, అలాగని పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదని అన్నారు. ఒక తమిళ్ సినిమా చేస్తున్న సమయంలో నిర్మాతగా ఉన్న ఖాజాతో పరిచయం ఏర్పడిందని అన్నారు.

1999లో తాము వివాహం చేసుకున్నామని చెప్పారు. అయితే కాలక్రమేణా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అన్నారు.

ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు రావడంతోనే పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విడిపోయినప్పటికీ  ఫ్రెండ్లీగానే ఉన్నామని అన్నారు. 

 ప్రస్తుతం తన దృష్టి అంతా పిల్లల భవిష్యత్తు ,  కెరీర్‌పైనే ఉందని ఆమని స్పష్టం చేశారు. ఈ వివరణతో ఆమెపై గత కొన్నేళ్లుగా ఉన్న పుకార్లన్నీ పటాపంచలయ్యాయి. 

ఒక నటిగా ఎంత సక్సెస్ సాధించినా, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను ఆమె ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారని నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.