AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

ఏపీలోని మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ విషయాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. రెండు విడతలుగా వీటిని భర్తీ చేయనున్నారు.

Andhra Pradesh: ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
Nandyal Anganwadi Recruitment
Venkatrao Lella
|

Updated on: Apr 27, 2026 | 10:13 PM

Share

ఏపీ మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీల్లో 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అంగన్వాడీల్లో ఉన్న 5 వేల హెల్పర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సోమవారం పార్వతీపురంలో ఆమె పర్యటించారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు. మొదటి విడతలో 2,645 పోస్టులతో పాటు రెండో విడతలో మిగిలిన పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.

రెండు విడతలుగా పోస్టుల భర్తీ

మినీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌డ్రేట్ చేస్తున్నట్లు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఇక అంగన్వాడీల్లో పనిచేసే ఆయాలకు ప్రమోషన్ ఇస్తామని, అంగన్వాడీ కార్యకర్తలుగా వారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. వారికి టీచర్ హోదా ఇచ్చి జీతాలు అందించినట్లు తెలిపారు. త్వరలోనే 2645 హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని, నియామకాలు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఇక రాష్ట్రంలో 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ సేవలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఇటీవల 58,204 కార్యకర్తలకు 5జీ స్మార్ట్‌ఫోన్లను అందించామన్నారు. ఇక సూపర్ వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు కూడా స్మార్‌ఫోన్లను అందించినట్లు పేర్కొన్నారు.

Follow Us