AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం.. గోల్డ్‌, సిల్వర్స్ మెడల్స్‌తో మెరిసిన భార్గవి

సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి సంచలనం సృష్టించింది. తన అద్భుత ప్రతిభతో ఏకంగా రెండు పతకాలను కొల్లగొట్టి అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భార్గవి రెండు వేర్వేరు విభాగాల్లో పతకాలు సాధించి డబుల్ ధమాకా అందించింది.

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం.. గోల్డ్‌, సిల్వర్స్ మెడల్స్‌తో మెరిసిన భార్గవి
Commonwealthweightlifting Champion
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Apr 27, 2026 | 10:50 PM

Share

విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన భార్గవి యూత్ విభాగంలో గోల్డ్ మెడల్, జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటింది. మొత్తం 180 కిలోల బరువును ఎత్తిన ఆమె స్నాచ్‌లో 78 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 102 కిలోలు ఎత్తి ఈ ఘనత సాధించింది. భార్గవి విజయం వెనుక ఆమె కృషి, క్రమశిక్షణతో పాటు కోచ్ వల్లూరి శ్రీనివాసరావు సూచనలు కీలక పాత్ర పోషించాయి. చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆమె పట్టుదలకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన భార్గవి నేపథ్యం ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు బెల్లాన శ్రీనివాసరావు, గౌరి దంపతులు సాధారణ వ్యవసాయ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కూడా వారు కుమార్తెను క్రమశిక్షణతో పెంచి, ఆమె ఆశయాలకు అండగా నిలిచారు. భార్గవి సాధించిన విజయంతో విజయనగరం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. తమ కుమార్తె ప్రపంచ స్థాయిలో మెరవడంతో ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విజయంతో గ్రామ పెద్దలు, జిల్లా, రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు భార్గవిని ఘనంగా అభినందించారు.

ఆమె భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికి కీర్తి తేవాలని ఆశిస్తున్నారు. ఇటీవల భారత వెయిట్ లిఫ్టర్లు ప్రపంచస్థాయిలో మెరుగైన ప్రదర్శనలు చేస్తుండగా, భార్గవి వంటి యువ క్రీడాకారిణిలు భవిష్యత్ ఒలింపిక్స్‌కి ఆశాకిరణాలుగా నిలుస్తున్నారు. సరైన శిక్షణ, మౌలిక వసతులు అందితే భారతదేశం వెయిట్ లిఫ్టింగ్ రంగంలో మరింత ప్రతిష్ఠను సాధించగలదని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధూరి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధూరి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..