లీటరు చమురు కోసం కిలోమీటరంత క్యూలైన్లా?.. ఈ నరకానికి కారణమెవ్వరు?
మిడిలీస్ట్ యుద్ధం మన వంటింట్లో మంట బెట్టి, దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతను క్రియేట్ చేసి, బ్లాక్‌మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ఒక్కోటి నాలుగైదు వేలదాకా పలికిన రోజులు మొన్నటిదాకా భయపెట్టాయి. రెండు రాష్ట్రాల్లో హోటల్స్ అన్నీ మూతబడే ప్రమాదంలో పడ్డాయి. ఫుడ్ మెనూ చిక్కిపోయింది. దాదాపు కొవిడ్ నాటి గడ్డు పరిస్థితి. ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయాలు కూడా రెడీ ఐపొయ్యాయ్. కట్టెలపొయ్యి, బయోగ్యాస్, ఎలక్ట్రికల్ స్టవ్.. ఇలా కిచెన్ కాన్సెప్ట్‌లే మారిపొయ్యాయి. కట్‌చేస్తే, ఇప్పుడు పెట్రోల్-డీజిల్ సంక్షోభం. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తోంది.. మనిషి జీవనశైలిని కూడా ప్రభావితం చేస్తుందా?

ఆందోళన, అత్యాశ.. మనిషిలో విచక్షణను చంపేస్తుంది. ఎంతదూరమైనా పరుగెత్తిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ కొరత విషయంలో అదే జరుగుతోందా? మామూలు రోజులతో పోలిస్తే, శనివారం పెట్రోల్ 34 శాతం, డీజిల్ 16 శాతం డిమాండ్ పెరిగింది. ఆదివారం కూడా సగటున 22 శాతం డిమాండు పెరిగినట్టు లెక్క తేలింది. సోమవారమైతే పెట్రోల్ బంకుల దగ్గర క్యూలైన్లు, కన్జ్యూమర్ల కుస్తీలు, దాదాపు యుద్ధం సీన్లే. ఏపీలో మొత్తం పెట్రోల్ బంకులు 4 వేల 510. కానీ, సగానికి పైగా బంకుల్లో నోస్టాక్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. తిరుపతిలో 30 శాతం బంకులు మూతబడ్డంతో తిరుమలకూ తప్పలేదు డీజిల్ కష్టం. మంగళవారానికైనా పరిస్థితి మెరుగుపడుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు జనం. మిట్ట మధ్యాహ్నం.. మండుటెండ.. చుక్క చమురు కోసం తప్పవా తిప్పలు? రద్దీని తగ్గించడానికి బంకుల్లో రేషనింగ్ మంత్రం.. ఐనా అదే రొద! కన్‌జ్యూమర్ల కక్కుర్తి ప్లస్ క్రెడిట్ సిస్టమ్.. కొరతకు కారణాలెన్నో? డిపోల్లో కావల్సినంత చమురుంది, ఇక్కడైతే ఒక్క చుక్కకూ దిక్కు లేదు… ఎక్కడుంది లోపం? ఎందుకీ కటకట? మీ యుద్ధం ఐపోయిందో లేదో తెలీదు.. ఇక్కడ మా యుద్ధం మాత్రం భీకరంగా మొదలైంది. ఇక్కడ కుళాయి కాడ ఆడాళ్ల కొట్లాటకు నకలుగా మారింది పెట్రోల్ బంకుల దగ్గర వార్ సీన్లు. వెస్టేసియాలో మిస్సైళ్ల కుమ్ములాటల మేటర్‌ని జనం దాదాపుగా మర్చిపోయారు. కానీ, ఆ యుద్ధం తాలూకు సైడ్‌ఎఫెక్ట్స్ లోతట్టు జనాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ జిల్లా ఈ...
