AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

హైదరాబాద్‌ నగరంలో నీట మునిగి వరుగా ప్రాణాలు కోల్పోతున్న ఘటన తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆదివారం హిమాయత్‌ సాగర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు యువకులు మరణించిన ఘటన మరువక ముందే సోమవారం 11 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్‌ఫూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Hyderabad: తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
Child Death Hyderabad,
Anand T
|

Updated on: Apr 27, 2026 | 9:56 PM

Share

హైదరాబాద్‌ నగరంలోని కుషాయిగూడలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. BN రెడ్డినగర్‌కు చెందిన రిత్విక్ అనే 11 ఏళ్ల బాలుడు ఇటీవల స్థానికంగా ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లో స్విమ్మింగ్ నేర్చుకునేందుకు సమ్మర్ క్యాంప్‌లో చేరాడు. అయితే రోజూలాగే స్మిమ్మింగ్‌కు వెళ్లిన రిత్విక్ ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగాడు. అయితే అక్కడే ఉన్న కొందరు ఆ బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించగా.. మరో వ్యక్తి మాత్రం బయటే ఉండి చూస్తూ నిల్చున్నాడు.

మరికొందరు ట్యాబ్ సహాయంతో రిత్విక్‌ను కాపాడే ప్రయత్నం చేసినా ఎలాంటి లాభం లేకపోయింది. ఆ నీటిలో మునిగి ఊపిరాడక రిత్విక్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా పడిఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే భద్రత లేకుండానే బాలుడిని పూల్‌లోకి దింపారని పేరెంట్స్ ఆరోపించారు. ఇక బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే పిల్లలను స్విమ్మింగ్‌ పంపించే విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అవసరమైతే పేరెంట్స్ వెంట ఉండి పిల్లలను స్విమ్మింగ్‌కు తీసుకెళ్లాలని చెబుతున్నారు. అలాగే స్విమ్మింగ్‌ ఫూల్స్ నిర్వాహకులు కూడా భద్రత చర్యలను పటిష్టం చేయాలని, నిబంధనలు పాటించడి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

వీడియో చూండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us