AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? కేంద్రం తీసుకొచ్చిన రూల్స్ ఇవే..

ఆధార్ కార్డు వాడేవారికి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు.. డేట్ ఆఫ్ బర్డ్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు.. ఆధార్‌లో లింగం ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చా..? లాంటి అనేక విషయాలు చాలామందికి తెలియవు. ఇందుకు సంబంధించి ఆధార్ కొన్ని నిబంధనలను పొందుపర్చింది.

Aadhaar Card: ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? కేంద్రం తీసుకొచ్చిన రూల్స్ ఇవే..
Aadhaar
Venkatrao Lella
|

Updated on: Apr 27, 2026 | 9:34 PM

Share

ఆధార్ కార్డు అనేది దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ అత్యంత అవసరమైన డాక్యుమెంట్. ప్రభుత్వ పథకాలు పొందటం దగ్గర నుంచి కొత్త సిమ్ తీసుకోవడం, ఇల్లు కొనుగోలు చేయడం, బ్యాంక్ అకౌంట్ తెరవడం, ప్రభుత్వ సబ్సిడీలు పొందటం వరకు ఈ కార్డు అవసరం. దేశంలోని 95 శాతం ప్రజలు ఆధార్ కలిగి ఉన్నారు. ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, బయోమెట్రిక్ డేటా అంతా ఒకేచోట ఉంటుంది. ఇక ఈ వివరాల్లో తప్పులు ఉంటే అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది యూఐడీఏఐ. అయితే కొన్ని పరిమితులు విధించింది.

పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే..?

ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి యూఐడీఏఐ కొన్ని పరిమితులు విధించింది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పేరు మార్చుకోవడం కుదరదు. కొంతమంది తమ ఇంటి పేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఇక మహిళలు పెళ్లి తర్వాత తమ భర్త ఇంటి పేరును పెట్టుకుంటారు. దీంతో పేరును మార్చుకునే అవకాశం ఉంది. అయితే జీవితంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆధార్ కార్డులో ఇంటి పేరును మార్చుకోవచ్చు. అంతకంటే ఎక్కువసార్లు మార్చుకోలేరు. పెళ్లి తర్వాత మహిళలు తమ ఆధార్ కార్డులోని ఇంటి పేరును మార్చుకోవడం తప్పనిసరి కాదు. ఇంటి పేరునే కావాలనుకుంటే ఉంచుకోవచ్చు.

డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు…?

ఇక ఆధార్ కార్డులో పొందుపర్చిన వివరాల్లో డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యమైనది. అయితే కొంతమంది ప్రభుత్వ పథకాలు పొందేందుకు డేట్ ఆఫ్ బర్త్‌ను మార్చుకుంటున్నారు. దీనిని చెక్ పెట్టేందుకు జీవితంలో ఒకసారి మాత్రమే ఆధార్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్‌ను మార్చుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది. ఆధార్ కార్డు పొందే సమయంలో పుట్టిన తేదీ తప్పుగా పడ్డా.. తప్పుగా ముద్రించినా సరిదిద్దుకోవచ్చు. ఇక రెండోసారి కూడా తప్పుగా పడితే మార్చుకునే అవకాశం లేదు.

ఇక లింగాన్ని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?

ఇక ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే తమ లింగాన్ని ఆధార్ కార్డులో మార్చుకోవచ్చు. పదే పదే మార్చుకోవడానికి వీల్లేదని యూఐడీఏఐ తన నిబంధనల్లో పొందుపర్చింది. ఇక మొబైల్ నెంబర్, అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. వీటిపై ఎలాంటి పరిమితులు లేవు. చాలామంది మొబైల్ నెంబర్లను మారుస్తూ ఉంటారు. అలాగే వేర్వేరు ప్రాంతాల్లో స్ధిరపడుతూ అద్దె నివాసాల్లో ఉంటారు. దీంతో మొబైల్ నెంబర్, అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకునే అవకాశం యూఐడీఏఐ కల్పిస్తోంది. ఆధార్ కార్డు ఉపయోగించేవారందరూ ఈ విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

Follow Us