డెబిట్ కార్డ్ లేకపోయినా యూపీఐ పిన్ సెట్ చేసుకోవడం ఎలా..?

Venkatrao Lella

Images: Pinterest

20 JUNE 2026

ప్రతి యూపీఐ లావాదేవీకి నాలుగు లేదా ఆరు అంకెల యూపీఐ పిన్‌ను నమోదు చేయాలి. ఈ పిన్ చెల్లింపు సరైన వినియోగదారుడి ద్వారానే జరుగుతోందని ధృవీకరిస్తుంది. ఈ పిన్ సెట్ చేయడానికి డెబిట్ కార్డును ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డు ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది

ఆధార్ కార్డు ద్వారా యూపీఐ పిన్ సెట్ చేయడానికి మీ ఫోన్ నంబర్‌.. మీ ఆధార్ నంబర్‌కు లింక్ చేసి ఉండాలి. అలాగే మీ మొబైల్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాలో కూడా నమోదు చేయబడి ఉండాలి.

ఆధార్ కార్డు ద్వారా UPI PIN ను సెట్ చేయడానికి దశలవారీగా ఇక్కడ చూద్దాం

మొదట యూపీఐ యాప్‌ను తెరిచి బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయండి. UPI PIN ను సెటప్ చేసే ఆప్షన్‌ను ఎంచుకుని ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

ధృవీకరణ కోసం మీ ఆధార్ నంబర్‌లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.

ఆ తర్వాత యూపీఐ పిన్ సృష్టించుకోండి. ఓటీపీని మళ్లీ నమోదు చేసి మీ యూపీఐ పిన్‌ను నిర్ధారించండి.

మీ దగ్గర డెబిట్ కార్డు లేకపోయినా లేదా డెబిట్ కార్డును ఎక్కడైనా మర్చిపోయినా ఈ విధానం ద్వారా మీరు యూపీఐ పిన్ నిమిషాల్లోనే సెట్ చేసుకోవచ్చు.