రైలు ప్రయాణంలో నచ్చిన లోయర్ బెర్త్ సీటు కావాలా? ఈ ట్రిక్ వాడండి

17 June 2026

Pic credit - Instagram

Phani Ch

రైల్వేలో ప్రయాణించేటప్పుడు వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్న పిల్లలు ఉన్నప్పుడు కింది సీటు లేదా విండో సీటు దొరికితే ప్రయాణం ఎంతో సుఖంగా సాగుతుంది.

రైలు టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు చాలా సార్లు మనం లోయర్ బెర్త్ ఆప్షన్ ఎంచుకున్నా కూడా, చివరకు అప్పర్ బెర్త్ లేదా మిడిల్ బెర్త్ సీట్లు కేటాయించబడతాయి. దీని పరిష్కారాలను ఇప్పుడు చూద్దాం.

మీరు టికెట్ బుక్ చేసే సమయంలో ప్రయాణికుల వివరాలను నమోదు చేసేటప్పుడు, పక్కనే 'బెర్త్ ప్రిఫరెన్స్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.

అక్కడ మీకు కావలసిన లోయర్ బెర్త్ ను సెలెక్ట్ చేసుకోవడం బుకింగ్ ప్రక్రియలో మొదటి ప్రాథమిక స్టెప్. దాని కిందే ఉండే 'అదర్ ప్రిఫరెన్సెస్' అనే విభాగాన్ని గమనించాలి.

అందులో ఒక ముఖ్యమైన చెక్ బాక్స్ ఉంటుంది. "బుక్ ఓన్లీ ఇఫ్ అట్లీస్ట్ వన్ లోయర్ బెర్త్ ఈజ్ అలోటెడ్" అనే ఆప్షన్‌ను మీరు టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం వల్ల ఒకవేళ ఆ రైలులో కింది సీటు ఖాళీగా ఉంటేనే మీ టికెట్ బుక్ అవుతుంది. ఒకవేళ లోయర్ బెర్త్ ఖాళీగా లేకపోతే మీ టికెట్ బుక్ కాదు మరియు మీ డబ్బులు కూడా కట్ అవ్వవు.

రైల్వే నిబంధనల ప్రకారం, 60 ఏళ్లు పైబడిన పురుషులు మరియు 45 ఏళ్లు పైబడిన మహిళలకు ఐఆర్‌సీటీసీ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్‌లను కేటాయించడానికి ప్రయత్నిస్తుంది. దీనిని 'సీనియర్ సిటిజన్ కోటా' అంటారు.

ఒకవేళ మీరు ఒకే టికెట్‌పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణికుల కోసం బుక్ చేస్తుంటే, అక్కడ "బుక్ ఓన్లీ ఇఫ్ ఆల్ బెర్త్స్ ఆర్ అలోటెడ్ ఇన్ సేమ్ కోచ్" అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల అందరు ఒకే బోగీలో సీట్లు లభించే అవకాశం ఉంటుంది.