AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neredu Pallu: నేరేడు పండ్లు విరగకాయడం దేనికి సంకేతం.. నిజంగానే కరువు వస్తుందా..?

నేరేడు పండ్ల సమృద్ధి ఈ ఏడాది కరువుకు సంకేతమా? పెద్దల నమ్మకాలు, ఆధునిక వృక్షశాస్త్రంలోని మాస్టింగ్ సిద్ధాంతం ఈ హెచ్చరిక వెనుక ఉన్న తర్కాన్ని వివరిస్తున్నాయి. భూగర్భ జలాలు తగ్గడం, వాతావరణ మార్పుల ఒత్తిడిలో చెట్లు తమ జాతి మనుగడ కోసం విత్తనాలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. నీటిని పొదుపుగా వాడి, వర్షపు నీటిని సంరక్షించుకోవాలని ప్రకృతి మనకు సూచిస్తోందంటున్నారు నిపుణులు..

Shaik Madar Saheb
|

Updated on: Jun 22, 2026 | 4:11 PM

Share
ఈ సంవత్సరం నేరేడు పండ్లు విరగకాశాయి. మార్కెట్లలో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్ల రాశులు దర్శనమిస్తున్నాయి. గతంలో తక్కువగా పండిన చెట్లు సైతం ఈసారి విపరీతంగా పండ్లు కాశాయి. ఇది కేవలం ప్రకృతి యాదృచ్చికమా, లేక భవిష్యత్తు గురించి ప్రకృతి మనకు ఏదైనా రహస్య సంకేతాన్ని పంపుతోందా? ఈ ప్రశ్నకు మన పెద్దలు, ఆధునిక వృక్షశాస్త్రవేత్తలు కూడా సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతిని చాలా దగ్గరగా గమనించే మన పూర్వీకులు నేరేడు పండ్ల సమృద్ధిని కరువుకు ఒక సంకేతంగా భావిస్తున్నారు.

1 / 7
నేరేడు చెట్లకు విపరీతంగా పండ్లు కాస్తే, ఆ సంవత్సరంలో కరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారి నమ్మకం. కొందరు దీనిని మూఢనమ్మకంగా చూసినా, ఆధునిక వృక్షశాస్త్రంలో జరుగుతున్న కొన్ని పరిశోధనలు ఈ పరిశీలన వెనుక ఉన్న తర్కాన్ని వివరిస్తున్నాయి. అయితే.. నేరేడు విరగ్గాయడాన్ని కరువుతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

2 / 7
చాలా వృక్ష జాతులు కొన్ని సంవత్సరాల్లో అసాధారణంగా ఎక్కువ పండ్లు లేదా విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. దీనిని మాస్టింగ్ (Masting) అని అంటారు. ఇది చెట్టు తన జాతి మనుగడ కోసం అనుసరించే ఒక సహజ వ్యూహం. భూగర్భ జలాలు తగ్గడం, దీర్ఘకాలిక ఎండలు, ఉష్ణోగ్రతల పెరుగుదల లేదా ఇతర వాతావరణ ఒత్తిళ్లు ఎదురైనప్పుడు చెట్లు తమ జీవన చక్రంలో మార్పులు చేస్తాయి. అలాంటి సమయాల్లో, చెట్టు కొత్త కొమ్మలు, ఆకులు రావడంపై కాకుండా, పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై ఎక్కువ శక్తిని వెచ్చిస్తుంది.

3 / 7
నేరేడు చెట్ల వేర్లు చాలా లోతుగా భూమిలోకి వెళ్తాయి. పై పొరలో నీరు లేకపోయినా, అవి భూగర్భ జలాలను ఉపయోగించుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాంటి శక్తివంతమైన చెట్లకు సైతం నీటి ఒత్తిడి కనిపిస్తే, అది భూగర్భ జలాల పరిస్థితిపై ఒక తీవ్రమైన హెచ్చరిక సంకేతంగా భావించవచ్చు. అందుకే మన పూర్వీకులు నేరేడు చెట్లను గమనించి వాతావరణం గురించి అంచనాలు వేసేవారు.

4 / 7
ఈ సంవత్సరం ఏర్పడిన ఎల్ నినో (El Niño) ప్రభావం వల్ల 12 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, నేరేడు పండ్ల సమృద్ధి అనే సంకేతం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

5 / 7
అయితే, అధిక పండ్ల దిగుబడి ఉంటే తప్పనిసరిగా కరువు వస్తుందని చెప్పలేము. వర్షపాతం, గత సంవత్సరం వాతావరణ పరిస్థితులు, చెట్ల సహజ జీవచక్రం వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. ప్రకృతి మనకంటే ముందుగానే మార్పులను గుర్తిస్తుంది. మన పెద్దలు ఆ సంకేతాలను గమనించి తమ అనుభవాన్ని తరతరాలకు అందించారు. ఈ ఏడాది నేరేడు పండ్ల సమృద్ధిని ఆస్వాదిస్తూనే, మనం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలి. వర్షపు నీటిని సంరక్షించాలి. భూగర్భ జలాలను కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

6 / 7
అయితే, దీనిని కరువుకు ప్రత్యక్షంగా ముడిపెట్టడం సరైనది కాదు. ఒక సంవత్సరంలో నేరేడు పండ్ల ఉత్పత్తిలో భారీ పెరుగుదల వెనుక అనేక కారకాలుగా ఉంటాయని.. నిపుణులు చెబుతున్నారు.. గత సంవత్సరం వర్షపాతం, నేలలోని తేమ, ఉష్ణోగ్రత మార్పులు, పూత కాలంలోని వాతావరణం, పరాగసంపర్కానికి అనుకూలమైన పరిస్థితులు, వ్యాధులు – తెగుళ్ల సంఖ్య, చెట్ల వయస్సు అన్నీ దీనిని ప్రభావితం చేస్తాయని.. దీనిని ఆ కోణంలో చూడటం సరికాదని సూచిస్తున్నారు.

7 / 7
Follow Us