AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియన్​ మార్కెట్​పై Norton Atlas ఫోకస్​.. ఇంజిన్ కెపాసిటీతో మతిపోగొట్టేస్తున్న ఆటోమొబైల్​ దిగ్గజం

ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ నార్టన్ (Norton) భారత మార్కెట్‌పై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే మ్యాంక్స్ ఆర్ (Manx R) బైక్‌కు పేటెంట్ పొందిన సంస్థ తాజాగా తన అడ్వెంచర్ మోటార్‌సైకిల్ Norton Atlasకు కూడా భారతదేశంలో పేటెంట్ పొందింది. యూకేలో పరిచయమైన ఈ బైక్‌తో పాటు రోడ్లపై ప్రయాణించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన Atlas GT మోడల్‌ను కూడా భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు మోడళ్ల తయారీ భారత్‌లోని TVS Motor Company హోసూర్ ప్లాంట్‌లో చేపట్టడం బ్రాండ్‌ విస్తరణకు కీలకంగా మారింది.

ఇండియన్​ మార్కెట్​పై Norton Atlas ఫోకస్​.. ఇంజిన్ కెపాసిటీతో మతిపోగొట్టేస్తున్న ఆటోమొబైల్​ దిగ్గజం
Norton Atlas Adventure Motorcycle
Nikhil
|

Updated on: Nov 20, 2026 | 6:00 AM

Share

అడ్వెంచర్ బైక్‌ల విభాగంలో కొత్త మోడళ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో నార్టన్ తన Atlas సిరీస్‌తో ఈ విభాగంలోకి అడుగుపెడుతోంది. బ్రిటన్‌లో డిజైన్‌, ఇంజినీరింగ్ చేసిన ఈ బైక్‌లను భారత్‌లో తయారు చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా అందించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. Atlas, Atlas GT రెండూ ఒకే ప్లాట్‌ఫామ్‌పై రూపొందించినప్పటికీ, వాటి డిజైన్‌, వీల్ సైజులు, రైడింగ్ అవసరాల్లో తేడాలు ఉంటాయి.

అధునాతన ఫీచర్లు

Norton Atlasలో 585cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 9,300rpm వద్ద 70hp గరిష్ట పవర్‌ను, 7,300rpm వద్ద 57.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు అనుసంధానించారు. బైక్ రైడింగ్‌ను సులభతరం చేసేందుకు బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌, స్లిప్పర్ క్లచ్‌ను స్టాండర్డ్‌గా అందించారు. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై రూపొందించిన ఈ బైక్‌లో కాస్ట్ అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్ ఉంటుంది. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో పూర్తిగా అడ్జస్ట్ చేసుకునే USD ఫోర్కులు, వెనుకవైపు రిమోట్ ప్రీలోడ్ అడ్జస్టర్‌తో కూడిన మోనోషాక్‌ను అందించారు. వీటిని KYB తయారు చేసింది.

Norton Atlas, Atlas GT మధ్య ప్రధాన తేడాలు వాటి రైడింగ్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. Atlas అడ్వెంచర్ రైడింగ్ కోసం రూపొందించారు. ఇందులో 19 అంగుళాల ఫ్రంట్ వీల్ ఉంటుంది. Atlas GT రోడ్లపై ప్రయాణించేందుకు అనువుగా రూపొందించగా, ఇందులో 17 అంగుళాల ఫ్రంట్ వీల్‌ను అందించారు. Atlas సీట్ హైట్ 845mmగా ఉండగా, Atlas GTలో 815mm మాత్రమే ఉంటుంది. అడ్వెంచర్ వెర్షన్‌లో ఎక్కువ సస్పెన్షన్ ట్రావెల్ ఉండటంతో ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.

ఈ రెండు మోడళ్లలో కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, వివిధ రైడింగ్ మోడ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 8 అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లేను అందించారు. రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని ఈ స్క్రీన్‌పై చూడవచ్చు.

భారత్‌లో ఎప్పుడు?

Norton Atlas, Atlas GT మోడళ్ల తయారీ TVS Motor Company హోసూర్ ప్లాంట్‌లో జరుగుతోంది. భారత మార్కెట్‌లో ఈ మోడళ్ల విడుదలకు సంబంధించి కంపెనీ ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయి. భారత్‌లో స్థానికంగా తయారీ చేపట్టడం వల్ల ధరలను పోటీగా నిర్ణయించే అవకాశం ఉంది.

యూకే మార్కెట్లో Norton Atlas ప్రారంభ ధర 8,250 పౌండ్లు (సుమారు రూ.10.22 లక్షలు)గా ఉంది. భారత్‌లో తయారీ కారణంగా స్థానిక మార్కెట్లో ధర కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 వంటి అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే భారత్‌లో విడుదల తేదీ, ధరలకు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us