ఆధార్ కార్డు
ఆధార్ కార్డ్ అనేది ప్రత్యేక గుర్తింపు ధృవీకరణ పత్రం. ఇది భారత ప్రభుత్వం చేత నిర్వహించబడుతుంది, జారీ చేయబడుతుంది. భారత పౌరులకు ప్రతి ఆధార్ కార్డులో 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించబడుతుంది. పూర్తి పేరు, ఫొటో, చిరునామా, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, బయోమెట్రిక్ వివరాలు ఆధార్ కార్డులో చేర్చబడ్డాయి. 2009 జనవరి 28 నుంచి ఆధార్ కార్డు జారీ ప్రారంభించారు. ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ కావడం విశేషం. 2017నాటికి 119 కోట్ల మంది ప్రజలు ఆధార్ కార్డును కలిగి ఉన్నారు. ఇది ప్రభుత్వ పథకాలు, సౌకర్యాల ప్రయోజనాన్ని పొందడానికి ఉపయోగించబడుతుంది.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలకు కూడా ఆధార్ ఉపయోగించబడుతుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆధార్‌కు సంబంధించిన మోసాలు కూడా పెరిగాయి. ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి సంబంధించిన స్కామ్‌లను మీరు ఎలా నివారించవచ్చు, TV9 తెలుగు వెబ్ సైట్ టెక్నాలజీ విభాగంలో మీరు దాని గురించి సమాచారాన్ని పొందుతారు. దీనితో పాటు, మీరు ఇంట్లో కూర్చొని మొబైల్ నంబర్, చిరునామా, ఫోటో వంటి ఆధార్ డేటాను ఎలా మార్చుకోవచ్చో మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవడం ఎలా..? దీని కోసం ఎంత ఛార్జీలను వసూలు చేస్తారన్న వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
ఇంకా చదవండిAadhaar Card: ఆధార్ కార్డులు వాడేవారికి బిగ్ అప్డేట్.. కేంద్రం 5 భారీగా మార్పులు.. అమల్లోకి వచ్చేశాయ్..
ఆధార్ కార్డుకు సంబంధించి ఐదు పెద్ద మార్పులు అమల్లోకి వచ్చేశాయి. యూఐడీఏఐ కొత్త వెబ్‌సైట్‌తో పాటు ఆధార్ సేవలు సులభతరంగా పొందేందుకు యూఐడీఏఐ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. రేషన్ షాపుల్లో ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థలో కూాడా మార్పుల చేసింది. అవేంటి అనేది చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Oct 1, 2026
- 8:53 pm
Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇక నో టెన్షన్..
యూఐడీఏఐ ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఆథార్ ఫేస్ ఆధెంటికేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా ఆధార్ కేవైసీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఫేస్ వెరిఫికేషన్ కోసం ఇతర యాప్‌లను ఓపెన్ చేయడాన్ని ఇది తగ్గిస్తుంది.
- Venkatrao Lella
- Updated on: Sep 27, 2026
- 7:43 pm
Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి బిగ్ న్యూస్.. ఈ నెల 30 వరకే ఛాన్స్.. ఆ తర్వాత ఛార్జీలు కట్టాల్సిందే..
పిల్లల తల్లిదండ్రులకు యూఐడీఏఐ బిగ్ అలర్ట్ జారీ చేసింది. చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్డేట్ చేయించాలని తెలిపింది. ఈ మేరకు ఉచితంగా అప్డేట్ చేయించేందుకు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత సేవా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
- Venkatrao Lella
- Updated on: Sep 24, 2026
- 4:28 pm
Aadhaar Card: ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ మార్చుకోవాలా..? నిమిషాల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే కేవైసీ లేదా గుర్తింపు ధృవీకరణ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ముఖ్యం.
- Venkatrao Lella
- Updated on: Sep 12, 2026
- 1:54 pm
Aadhaar Card: ఆధార్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చేసింది. వెరిఫికేషన్ మరింత సులువు..
ఆధార్ కార్డు ఉన్నవారికి యూఐడీఏఐ తీపికబురు అందించింది. అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న ఆ సంస్థ.. ఇప్పుడు ఆధార్ వినియోగదారులకు ఉపయోగపడేలా మరో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ ప్రక్రియ సులభతరం కానుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Sep 11, 2026
- 8:17 am
Aadhaar Card: మీ ఆధార్‌లో ఏయే వివరాలు అప్డేట్ చేశారో మర్చిపోయారా..? డోంట్ వర్రీ.. సెకన్లలోనే తెలుసుకోండిలా..
ఆధార్ కార్డులో ఏయే వివరాలు అప్డేట్ చేశారనే విషయాలు మీరు మర్చిపోయారా.. డోంట్ వర్రీ.. మీరు ఆన్‌లైన్‌లో సులువుగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. కొన్ని నిమిషాల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Sep 9, 2026
- 12:53 pm
Aadhaar Card: ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలా..? జీవితకాలంలో మొత్తం ఎన్నిసార్లు మార్చకోవచ్చంటే..?
ఆధార్ కార్డులో అన్నీ వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కేవైసీ ధృవీకరణ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని వివరాలు ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ఈ మేరకు యూఐడీఏఐ కొన్ని పరిమితులు విధించింది.
- Venkatrao Lella
- Updated on: Sep 7, 2026
- 1:07 pm
Aadhaar Card: ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? కేంద్రం రూల్స్..
ఆధార్ కార్డు ఫొటోలో ఫొటోను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చా? ఆన్లైన్‌లో మార్చుకోవచ్చా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే ఇందుకు సంబంధించి యూఐడీఏఐ కొన్ని నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ నిబంధనలు ఎలా ఉన్నాయంటే..
- Venkatrao Lella
- Updated on: Aug 27, 2026
- 7:45 am
Aadhaar Card: హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? మారిన రూల్స్.. ఇకపై ఇవ్వాల్సిన పనే లేదు..
యూఐడీఏఐ అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. మీరు హోటల్‌కి వెళ్లినప్పుడు ఆధార్ ఒరిజినల్ చూపించడం లేదా జిరాక్స్ ఇవ్వడం లాంటివి అక్కర్లేదు. ఇలా ఇవ్వడం వల్ల మీ వివరాలకు గొప్యత ఉండదు. మోసగాళ్లకు దొరికితే దుర్వినియోగం అవుతాయి. దీనికి చెక్ పెట్టేందుకు క్యూఆర్ ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Aug 26, 2026
- 9:27 pm
Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం.. అప్పటివరకే టైమ్..
ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్. యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అప్డేట్ చేయించుకునే అవకాశం కల్పిస్తోంది. సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇది వీరికి మాత్రమే అందుబాటులో ఉంటుందని యూఐడీఏఐ తెలిపింది.
- Venkatrao Lella
- Updated on: Aug 23, 2026
- 6:49 pm
Aadhaar Card: ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదు.. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. మీ గ్రామంలోనే..
ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే పట్టణాల్లోని ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ మీ గ్రామంలోనే ప్రత్యేక క్యాంపులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఇక్కడ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఉచితంగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
- Venkatrao Lella
- Updated on: Aug 14, 2026
- 7:49 am
Aadhaar Card: ఆధార్ ఇంట్లో మర్చిపోయారా..? మీ వాట్సప్‌లోనే సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే..
మీకు అర్జంట్‌గా ఆధార్ కార్డు అవసరం పడిందా.. కానీ మీ దగ్గర అందుబాటులో లేదా.. అయితే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ వాట్సప్ నుంచే సులువుగా డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఎలా అంటే..
- Venkatrao Lella
- Updated on: Aug 13, 2026
- 1:28 pm