AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

Phani CH
|

Updated on: Dec 04, 2025 | 9:21 PM

Share

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ మహారాష్ట్రపై అద్భుత శతకం సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత, అతను కేవలం 61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు. బీహార్ తరఫున కీలకమైన ఈ ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఈ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ఫామ్‌లోకి తిరిగి వచ్చాడని భారత అండర్-19 జట్టు ఆనందం వ్యక్తం చేసింది.

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు సెంచరీతో అదరగొట్టాడు. 2025లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన తర్వాత మహారాష్ట్రతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తన సెంచరీని సిక్స్‌తో పూర్తీ చేశాడు. వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో కేవలం 58 బంతుల్లోనే తన సెంచరీని సాధించాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బీహార్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. బీహార్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఒక్కడే అజేయంగా 108 పరుగులు చేశాడు. అతను కేవలం 61 బంతుల్లోనే 177 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. బీహార్ తరపున వైభవ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాడు. అతడితో పాటు బిపిన్ సౌరభ్‌ మరో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే తక్కువ పరుగులకే సౌరభ్ పెవిలియన్ చేరాడు. అయితే మరో ఎండ్‌లో వైభవ్ సూర్యవంశీ మూడో వికెట్‌కు ఆకాష్ రాజ్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 14వ ఓవర్ మూడో బంతికి వైభవ్ సూర్యవంశీ, ఆకాష్ రాజ్‌ల భాగస్వామ్యం కంచికి చేరింది. ఆ సమయానికి, బీహార్ స్కోరు 3 వికెట్లకు 101 పరుగులు మాత్రమే. కానీ వైభవ్ ఊచకోత ఆగలేదు. ఆకాష్ రాజ్ అవుట్ అయిన తర్వాత, వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌ గేర్ మార్చాడు. మొదట అర్ధ సెంచరీ మార్కును దాటగానే.. వేగంగా సెంచరీని పూర్తీ చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మొదటి మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, నాలుగో మ్యాచ్‌లో మహారాష్ట్రపై అతను అద్భుతమైన సెంచరీ సాధించడంతో భారత అండర్ 19 జట్టు ఊపిరి పీల్చుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే

కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రికార్డు స్థాయిలో స్పందన