AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్

కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్

Phani CH
|

Updated on: Dec 04, 2025 | 8:44 PM

Share

హర్యానాలో రూ.1.17 కోట్లకు అమ్ముడై దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా రికార్డు సృష్టించిన HR88B8888 VIP నంబర్ మళ్లీ వేలానికి సిద్ధమైంది. కొనుగోలుదారుడు నిర్ణీత గడువులోపు చెల్లింపు చేయలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 'B' అక్షరం '8'ని పోలి ఉండటంతో ఈ నంబర్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకోవడానికి కొత్త బిడ్డర్లు ఎవరు ముందుకొస్తారో చూడాలి.

కొందరు తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు పెట్టుకోవాలని ఇష్టపడతారు. అందుకోసం లక్షల్లో వెచ్చిస్తారు. ఇటీవల హర్యానాలో రూ.1.17 కోట్లకు అమ్ముడై, దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా రికార్డు సృష్టించిన వీఐపీ నంబర్ ప్లేట్ HR88B8888 మళ్లీ వేలానికి సిద్ధమైంది. ఈ నంబర్ ప్లేట్‌ను దక్కించుకున్న వ్యక్తి నిర్ణీత గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోములస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అయిన సుధీర్ కుమార్, ఈ VIP నంబర్ కోసం బిడ్ వేశారు. అయితే రూ.1.17 కోట్ల బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చివరి తేదీ అయిన డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆయన చెల్లింపు చేయలేకపోయారు. దీనిపై సుధీర్ కుమార్ ఏం చెప్పారంటే… శనివారం రాత్రి రెండుసార్లు బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ప్రయత్నించానని.. కానీ సాంకేతిక సమస్య కారణంగా అది విఫలమైందని తెలిపారు. అంతేకాకుండా, నంబర్ ప్లేట్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడాన్ని తన కుటుంబం కూడా వ్యతిరేకించిందని తెలిపారు. దీంతో ఈ అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌ను తిరిగి వేలం వేయాలని అధికారులు ఆదేశించారు. వీఐపీ నంబర్ HR88B8888 సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి దాని ప్రత్యేకతలే కారణం. ఈ నంబర్‌లో B అనే పెద్ద అక్షరం 8 అనే అంకెను పోలి ఉండటం వలన ఈ శ్రేణి మొత్తం ఎనిమిది సంఖ్యల ప్రత్యేక స్ట్రింగ్‌గా కనిపిస్తుంది. ఈ నంబర్ ప్లేట్‌లో హర్యానాకు HR, నిర్దిష్ట RTOకి 88, సిరీస్‌కుB, రిజిస్ట్రేషన్ నంబర్‌గా 8888 ఉంటాయి. హర్యానాలో VIP లేదా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం వారానికోసారి ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తారు. బిడ్డర్లు ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటల మధ్య తమకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమై బుధవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఈ వేలం పూర్తిగా పరివాహన్ వ్యవస్థ అధికారిక ఫ్యాన్సీ నంబర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ నంబర్ ప్లేట్ తిరిగి వేలానికి రావడంతో, దీన్ని సొంతం చేసుకోవడానికి కొత్త బిడ్డర్లు ఎవరు ముందుకొస్తారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రికార్డు స్థాయిలో స్పందన

TTD: టీటీడీ సంచలన నిర్ణయం..

మొన్నటి దాకా రీతూ.. ఇప్పుడు భరణి! పవన్ గేమ్ ఖతం

కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. బిడ్డను చూడడానికి వెళ్లిన తండ్రిని ఏం చేశారంటే..

Follow Us