కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. బిడ్డను చూడడానికి వెళ్లిన తండ్రిని ఏం చేశారంటే..
నంద్యాల జిల్లాలో యజ్ఞతేజారెడ్డి, మల్లేశ్వరి దంపతుల మధ్య బిడ్డ కస్టడీపై తీవ్ర వివాదం చెలరేగింది. కోర్టు అనుమతితో బాబును చూడటానికి వెళ్లిన యజ్ఞతేజారెడ్డిని అత్తింటివారు నిర్బంధించి, 63 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఇరు పక్షాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ చిన్నారి వీడియో వైరల్ అయింది, అది ఈ కేసులో కీలక మలుపు.
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ చోటు చేసుకోవడంతో పాటు…. అది ఉద్రిక్తతకు దారి తీసింది. నంద్యాల జిల్లా కనకాద్రిపల్లెలో రోజంతా హైడ్రామా నడిచింది. 5ఏళ్ల క్రితం యజ్ఞతేజారెడ్డి, మల్లేశ్వరి పెళ్లి చేసుకున్నారు. తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తడంతో బాబుతో పుట్టింటికి వచ్చేసింది మల్లేశ్వరి. కోర్టు అనుమతితో ఆదివారం నాడు బాబును చూసేందుకు యజ్ఞతేజ వెళ్లాడు. అప్పుడే సీన్ మారింది. యజ్ఞతేజను.. అత్తింటివారు సూటిపోటి మాటలన్నారు. మాటా మాటా పెరగడంతో మళ్లీ గొడవ జరిగింది. దీంతో అయ్యప్పమాలలో ఉన్న అతడిని మల్లేశ్వరి బంధువులు ఓ ఇంట్లో బంధించారు. యజ్ఞతేజాను విడిచిపెట్టాలంటే 63 లక్షల రూపాయిలు ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారని.. అలా ఫోన్ చేశారని తేజ తల్లి ఆరోపించింది. నంద్యాల ఎస్పీని యజ్ఞతేజ పేరెంట్స్, బంధువులు కలిశారు. పోలీసులు సహకరించపోవడంతో కోర్టుకు వెళ్లడానికి యోచిస్తున్నారు. పిల్లాడిని చూసేందుకు వచ్చిన యజ్ఞాతేజారెడ్డి.. తన అనుచరులతో కత్తులను వెంట తీసుకువచ్చాడని.. తమను బెదిరించాడని మల్లేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సీన్ ఇలా ఉంటే.. ఈ మొత్తం స్టోరీలో కీలకంగా మారిన యజ్ఞతేజా-మల్లేశ్వరి కొడుకు వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ చిన్నారి ఏం చెప్పాడో చూడండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hardik Pandya: సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హార్ధిక్ ??
Elon Musk: ఎలన్ మస్క్ కుమారుడి పేరు శేఖర్
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
ఇది ఆటోనా.. అంబులెన్సా.. అర్ధరాత్రి వేళ..
అర్ధరాత్రి రోడ్డుపై షాకింగ్ సీన్.. ఇరువైపులా ఆగిపోయిన వాహనాలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

