అర్ధరాత్రి రోడ్డుపై షాకింగ్ సీన్.. ఇరువైపులా ఆగిపోయిన వాహనాలు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు, కేబీఆర్ పార్క్ వద్ద రాత్రివేళ భారీ పాము కలకలం సృష్టించింది. వర్షాల కారణంగా పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని కథనం. వాహనదారులు, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కొందరు యువకులు చాకచక్యంగా పామును తిరిగి పార్కులోకి పంపారు. పార్క్ సందర్శకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నగర నడిబొడ్డున రాత్రివేళ ఓ పెద్ద పాము జనాలను భయాందోళనకు గురి చేసింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వనాల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డులో ఓ పెద్ద పాము హల్చల్ చేసింది. రాత్రివేళ రోడ్డుదాటుతున్న ఆ పామును చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో వాహనాలు రోడ్డుకు ఇరువైపులా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న కేబీఆర్ పార్క్ వద్ద ఓ పెద్ద పాము రోడ్డు దాటుతూ కనిపించింది. నడిరోడ్డుపైకి రాగానే ఆ మార్గంలో వెళ్తున్న కొందరు ఆ పామును చూసి అక్కడికక్కడే వాహనాలు నిలిపివేశారు. ఇంకొందరు భయంతో అక్కడినుంచి పారిపోయారు. ఇక పామును చూసేందుకు వాహనదారులు వాహనాలు దిగి అక్కడికి వచ్చేసరికి.. ఓవైపు లైట్ల వెలుగు, మరోవైపు వాహనదారుల అలికిడికి భయపడిన పాము ఎటు వెళ్లాలలో తెలియక బిక్కుబిక్కుమంటూ చూస్తుండిపోయింది. ఈ దృశ్యాలను కొంతమంది మొబైల్ ఫోన్లలో రికార్డు చేసారు. అక్కడ చేరినవారిలో ఇద్దరు యువకులు ముందుకు వచ్చి ఆ పామును అక్కడి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేశారు. తిరిగి దానిని పార్కులోకి వెళ్లేలా చేశారు. పార్క్ లోపల నుంచి రోడ్డుపైకి వచ్చిన ఆ పాముని అతి కష్టం మీద ఆ ఇద్దరు యువకులు మళ్లీ పార్క్ వైపుకే మళ్లించి పంపించేశారు. కేబీఆర్ పార్క్ నగరంలోనే పెద్ద పేరున్న పార్క్. ఇక్కడికి చాలా మంది వాకింగ్ కోసం వస్తుంటారు. అలాంటి సమయాల్లో విష సర్పాలు లాంటివి కనిపిస్తే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అందుకే పార్కులో వాకింగ్ చేసుకునేవాళ్లు, కాసేపు సమయం గడిపడానికి వచ్చేవాళ్లు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆ యువకులు సూచించారు. పొద్దున, సాయంత్రం వేళల్లో కేబీఆర్ పార్కులోకి వచ్చే సమయంలో కాస్త ముందూ వెనుక గమనిస్తూ వాకింగ్ చేసుకోవాలని, లేదంటే ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి మందుబాబు చిందులు.. వీధికుక్కలతో కూడా..
ఒకప్పడు వాళ్లదే చరిత్ర.. ఇప్పుడు గత చరిత్ర
TOP 9 ET News: సమంతకు రూ.కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన భర్త రాజ్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

