సెలబ్రిటీ వెడ్డింగ్‌లో కనిపిస్తున్న ఎరుపు రంగు చీరలు
సెలబ్రిటీ పెళ్లికూతుర్ల ఎరుపు రంగు చీరల మోజుపై ఈ కథనం. సమంత, నయనతార, లావణ్య త్రిపాఠి, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే వంటి తారలు తమ వివాహాలలో ఎరుపు రంగు చీరల ఆకర్షణను ఎలా ప్రదర్శించారో వివరిస్తుంది. మండపంలో వధువు అందాన్ని ద్విగుణీకృతం చేసే ఈ సాంప్రదాయ వస్త్రధారణ, ఎప్పటికీ ట్రెండ్‌లోనే ఉంటుందని రుజువు చేస్తుంది.
ఆత్మీయులందరూ అక్షితలు చల్లుతున్న వేళ వధువు అలంకరణ మీద ప్రత్యేక శ్రద్ధ తప్పక ఉంటుంది… పెళ్లి కూతురు మండపంలో ముస్తాబై కూర్చున్నప్పుడు ఎరుపు రంగు చీర కట్టుకుంటే ఆ అందాన్ని వర్ణించడం ఎవరి తరం? అందులోనూ సినీ సెలబ్రిటీల వివాహ క్రతువులో ఎరుపు రంగు చీరల అందాన్ని గమనించని వారుంటారా… ఆలస్యమెందుకు? ఆ విశేషాలు చూసేద్దాం పదండి… రాజ్‌ని భూత శుద్ధి వివాహం చేసుకున్నారు సామ్. అందరూ సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగా, ఈ వేడుకను ఇంత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కాస్ట్యూమ్స్ డిజైనర్‌కి థాంక్స్ చెప్పారు సామ్. ఆ క్షణమే సామ్ కట్టుకున్న ఎరుపు రంగు చీర గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు నెటిజన్లు. అంతే కాదు, నయనతార పెళ్లిలో కట్టుకున్న చీర రంగు కూడా ఇదేనని గుర్తుచేసుకున్నారు. మలయాళ బ్యూటీలు నయన్ అండ్ సామ్ మాత్రమే కాదు, మన తెలుగింటి కోడలైన లావణ్య త్రిపాఠి కూడా పెళ్లికూతురైన వేళ కుంకుమ రంగు చీరే కట్టుకున్నారు. వరుణ్‌తేజ్‌తో దండలు మార్చుకున్న ఆ క్షణం ఆమె సిగ్గు కు తోడైంది ఎరుపు రంగే. మన వాళ్లే కాదు, నార్త్ హీరోయిన్లు కూడా లాల్ రంగ్ కా ప్రేమ్‌ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నారు. విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు వధువుగ కత్రినా మెరిసింది కూడా ఎరుపు రంగు చీరలోనే. రాజ్‌కుమార్ రావు పెళ్లి వేడుకలో వధువు కట్టుకున్నదీ రెడ్ శారీనే. పెళ్లిలో కాకపోయినా, ఓ సందర్భంలో సిద్ధార్థ్‌తో కలిసి ఎరుపు రంగు చీరలో కనిపించారు అదితిరావు హైదరి. మన దీపిక పెళ్లి కూతురిగా కనిపించిన క్షణాలు గుర్తున్నాయా? రెడ్ శారీలో ఎలిగెంట్‌గా కనిపించారు దీప్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా
Akhanda 2: బాలయ్యకు గుడ్ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?
‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్ స్టేషన్‌కు శేఖర్ బాషా!
సామ్ లాగే ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ??
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

