శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రికార్డు స్థాయిలో స్పందన
తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 1.8 లక్షల టోకెన్లకు 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు పది రోజుల దర్శనాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్ డిప్ పద్ధతిలో టికెట్లు కేటాయించారు. సామాన్య భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటిది వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠనాధుని దర్శనం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకు టీటీడీ వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల కోసం ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు పది రోజుల పాటు జరిగే దర్శనాల కోసం 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన 1.80 లక్షల టోకెన్లకు గాను, ఏకంగా 24,05,237 మంది భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. అత్యంత పర్వదినాలైన వైకుంఠ ఏకాదశి , ద్వాదశితో పాటు చాలామంది సెంటిమెంట్ గా భావించే నూతన సంవత్సరం.. ఈ మూడు రోజులు వరుసగా రావడంతో ఆయా రోజులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులకు గాను 9.6 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ టోకెన్లను డిసెంబర్ 2న ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో భక్తులకు కేటాయించారు. అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది, వెబ్‌సైట్ ద్వారా 9.3 లక్షల మంది, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సేవ ద్వారా 1.5 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన ఏడు రోజులు..జనవరి 2 నుంచి 8 వరకు సంబంధించిన సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది. ఈ తేదీలకు గాను రోజుకు 15 వేలు చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను, వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను డిసెంబర్ 5న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. స్థానికుల కోసం జనవరి 6, 7, 8 తేదీలకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లను డిసెంబర్ 10న అందుబాటులో ఉంచుతారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొన్నటి దాకా రీతూ.. ఇప్పుడు భరణి! పవన్ గేమ్ ఖతం
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. బిడ్డను చూడడానికి వెళ్లిన తండ్రిని ఏం చేశారంటే..
Hardik Pandya: సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హార్ధిక్ ??
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

