కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
దక్షిణాఫ్రికాతో వన్డేలో విరాట్ కోహ్లీ తన 53వ శతకంతో అద్భుతం సృష్టించాడు. ఈ చారిత్రక సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి, వన్డేలలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ ఘనత పట్ల భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాపై ఎక్కువ సెంచరీలు, స్వదేశంలో 50+ స్కోర్లతో కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగుతోంది.
దక్షిణాఫ్రికాతో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుత శతకంతో అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించిన వెంటనే ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.విరాట్ కోహ్లీ తన 53వ వన్డే శతకాన్ని పూర్తి చేసుకున్న కాసేపటికే, అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. మైదానంలో విరాట్ కోహ్లీ బ్యాట్ పైకెత్తి ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న ఫోటోను షేర్ చేసిన ఆమె, దానికి ‘హార్ట్’ , ‘చప్పట్లు’ ఎమోజీలను జత చేశారు. ఎలాంటి రాతపూర్వక క్యాప్షన్ లేకపోయినా, ఈ ఎమోజీలతోనే ఆమె తన భర్త ప్రదర్శన పట్ల ఎంత గర్వంగా ఉందో తెలియజేశారు. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల విరాట్ కోహ్లీ తన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా, రాంచీలో కోహ్లీ సాధించిన 53వ సెంచరీ, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత అరుదైన రికార్డుగా నిలిచింది. ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీతో కోహ్లీ ఖాతాలో వన్డేల్లో 53 సెంచరీలు చేరాయి. అంతకుముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట టెస్ట్ ఫార్మాట్‌లో 51 సెంచరీల రికార్డు ఉండేది. అయితే.. కోహ్లీ వన్డేల్లో 52వ సారి మూడంకెల స్కోర్ అందుకొని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే 2023లో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా కూడా సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ సౌతాఫ్రికా పై ఇప్పటివరకు 6 సెంచరీలు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ సౌతాఫ్రికా పై 57 వన్డే మ్యాచ్‌లలో ఐదు సెంచరీలు కొట్టగా, కోహ్లీ కేవలం 32 మ్యాచ్‌లలోనే ఆరు సెంచరీలు కొట్టి, సచిన్ రికార్డును అధిగమించాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో మరో అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నాడు. కోహ్లీ సొంత మైదానంలో వన్డేల్లో అత్యధిక 50-ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో స్వదేశంలో 100 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా కోహ్లీ ఘనత సాధించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్.. అందరి టార్గెట్ ఆ దేశమే
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. విషయం తెలిస్తే ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్ ములాఖత్.. అబ్బో ఇక సీన్ సితారే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

