AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా

8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Dec 05, 2025 | 5:55 PM

Share

ఇండియన్ సినిమాలో '8 గంటల పని' పై పెద్ద చర్చ నడుస్తోంది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు దీన్ని ఉద్యోగం కాదంటూ భిన్నంగా మాట్లాడగా, దీపికా పదుకొనే, కీర్తి సురేష్, రష్మిక మందన్న వంటి హీరోయిన్లు దీర్ఘకాల పని గంటల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ప్రస్తావించారు. పని-జీవిత సమతుల్యత, నటీనటుల ఆరోగ్యంపై ఈ వాదన కీలక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

8 వర్కింగ్ హవర్స్.. ఇండియన్ సినిమాలో మోస్ట్ డిస్కసింగ్ పాయింట్ ఇదిప్పుడు. అందరూ దీని గురించే మాట్లాడుతున్నారిప్పుడు. తాజాగా మరో ఇద్దరు స్టార్స్ కూడా ఈ వర్కింగ్ హవర్స్‌పై ఓపెన్ అయ్యారు. హీరోయిన్లతో పోలిస్తే వీళ్ల మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ టాపిక్‌ను అనవసరంగా బూతద్ధంలో పెట్టి చూస్తున్నారా..? అసలేంటి ఈ వర్కింగ్ హవర్స్ ముచ్చట.. చూద్దాం పదండి.. వింటున్నారుగా రానా దగ్గుబాటి ఏమంటున్నారో..? నటనంటే ఉద్యోగం కాదన్నారీయన. రానా కేవలం నటుడు మాత్రమే కాదు.. నిర్మాత, ఇంకా చాలా..! సినిమా మేకింగ్ గురించి ఈయనకున్నంత క్లారిటీ ఎవరికీ ఉండదేమో ఈ జనరేషన్‌లో..! అలాంటి రానానే 8 వర్కింగ్ హవర్స్‌పై కుండ బద్ధలు కొట్టారు.. ఆయనకు తోడు దుల్కర్ సల్మాన్ సైతం మలయాళంలో లాంగ్ హవర్స్ ఉంటాయని చెప్పారు. ఇదే టాపిక్‌పై మొన్న కీర్తి సురేష్ కూడా మాట్లాడారు. పర్సనల్‌గా తాను 9 టూ 6తో పాటు 9 టూ 9కి కూడా ఓకే గానీ.. ఇందులో కొన్ని సమస్యలున్నాయన్నారు కీర్తి. కాకపోతే 9కి షాట్ అంటే 7.30కి లొకేషన్.. 5.30 గంటలకు నిద్ర లేవాలి. అంతా చేసినా నైట్ 11 వరకు డిన్నర్ కావట్లేదు.. ఇక 9 టూ 9 అంటే కనీసం 3 గంటల నిద్ర కూడా ఉండదంటున్నారు ఈ బ్యూటీ. ఆ మధ్య రష్మిక మందన్న సైతం ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. తాను ఓవర్ టైమ్ వర్క్ చేసాను కానీ అది అంత మంచిది కాదన్నారు రష్మిక. దేనికైనా పద్దతి ఉండాల్సిందే అన్నారు ఈ బ్యూటీ. వీటన్నింటికీ మూలం దీపిక పదుకొనే దగ్గర మొదలైంది. కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు 8 గంటలే పని చేస్తున్నా.. వాళ్లనెవరూ అడిగే ధైర్యం చేయరన్నారు దీపిక. తను మాత్రమే కాదు.. కొత్తగా అమ్మ అయిన హీరోయిన్లు కూడా 8 గంటలే పని చేస్తున్నారన్నారీమే. అన్నిచోట్ల 8 గంటలే పని చేస్తున్నపుడు సినిమాల్లోనే ఎందుకిలా అని ప్రశ్నించారు దీపిక. మొత్తానికి దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ మలయాళ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా..

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్.. నిజమైతే కనక.. హాలీవుడ్ షేకే అవ్వాల్సిందే

సామ్‌ రూట్లో సంయుక్త… ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్.. కెరీర్ బ్యాలన్స్ కోసం నానా కష్టాలు

Published on: Dec 05, 2025 05:55 PM