ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) మిస్ యూజ్ హీరోయిన్లకు తీవ్ర తలనొప్పిగా మారింది. డీప్‌ఫేక్ వీడియోలు, అభ్యంతరకర ఫోటోలతో వారి వ్యక్తిగత జీవితాలకు ముప్పు వాటిల్లుతోంది. రష్మిక మందన్న, కీర్తి సురేష్ వంటి ప్రముఖ తారలు AI దుర్వినియోగంపై గళం విప్పుతున్నారు. టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకోవాలని, నైతిక విలువల పతనాన్ని అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సైబర్ బెదిరింపుల నుంచి మహిళల గౌరవాన్ని కాపాడటం తక్షణావసరం.
AI మిస్ యూజ్ దారుణంగా జరుగుతుందా..? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్నారా..? వాళ్ల వ్యక్తిగత విషయాలను సైతం AIతో నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారా..? తాజాగా మన హీరోయిన్స్ కోపం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. మరో హీరోయిన్ సైతం AI మిస్ యూజ్‌పై తన గళం విప్పింది. ఎవరామె.. ఆమెకు జరిగిన నష్టమేంటి..? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయిప్పుడు. మనుషులతో అవసరం లేకుండా ఏకంగా సినిమాలు కూడా తీస్తున్నారు.. మరోవైపు ఎన్నో అవసరాల కోసం వాడుకుంటున్నారు. కానీ అదే టైమ్‌లో AIని మిస్ యూజ్ చేస్తున్న వాళ్లు లేకపోలేదు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుంది. దీనిపై స్టార్స్ ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ దుర్వినియోగంపై రష్మిక మందన్న ఓపెన్ అయ్యారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని.. అసభ్యంగా చూపించడం, టెక్నాలజీ దుర్వినియోగం చేయడం కొంతమంది వ్యక్తులలో నైతిక పతనాన్ని సూచిస్తుంది.. గుర్తుంచుకోండి ఇంటర్నెట్‌లో ఉన్నది ఇకపై ప్రతీది నిజం కాదని ట్వీట్ చేసారు రష్మిక. ఈమె పోస్ట్ వైరల్ అవుతుందిప్పుడు. రష్మిక మాత్రమే కాదు.. మొన్నటికి మొన్న కీర్తి సురేష్ సైతం AI మిస్ యూజ్ గురించి సీరియస్ అయ్యారు. అలాంటి వీడియోలు, ఫోటోలను చూస్తుంటేనే అసహ్యమేస్తుందంటూ కీర్తి మండిపడ్డారు. కేవలం వీళ్లే కాదు.. ఇంకా చాలా మంది స్టార్స్ సైతం టెక్నాలజీని సరైన పద్దతిలో వాడాలంటూ హితవు పలుకుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్ ములాఖత్.. అబ్బో ఇక సీన్ సితారే
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ మలయాళ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్.. నిజమైతే కనక.. హాలీవుడ్ షేకే అవ్వాల్సిందే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

