తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, తిమ్మయ్యపల్లెలో అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ పదవికి తల్లీ కూతుళ్లు శివరాత్రి గంగవ్వ, సుమలత పోటీపడుతున్నారు. కుటుంబ బంధాలను పక్కనబెట్టి, గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ తల్లీకూతుళ్ల పోరు మండలంలోనే హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అంటున్నారు అభ్యర్థులు. ఎన్నికల్లో బంధుత్వాన్నీ కూడా పట్టించుకోవడం లేదు. వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అయితే, కొన్నిచోట్ల అక్కడక్కడా సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్తులుగా రంగంలోకి దిగడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్య పల్లెలో తల్లిపై సొంత కూతురే పోటీకి దిగడం ఆసక్తిగా మారింది. తిమ్మయ్య పల్లె సర్పంచ్ స్థానం రిజర్వేషన్‌లో భాగంగా బీసీ మహిళకు కేటాయించారు. దీంతో తల్లి శివరాత్రి గంగవ్వ బరిలోకి దిగుతుండగా ఆమె కూతురు సుమలత ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. తల్లీ కూతుళ్లు ఇద్దరు మీ ఓటు నాకు వేయాలంటే.. కాదు కాదు నాకే వేయాలంటూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. సుమలత ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ని ప్రేమించి..పెళ్లి చేసుకున్నారు..అప్పటి నుంచి..ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలంచడంతో తల్లీ కూతుళ్లు ప్రత్యర్థులుగా పోటీకి సై అంటున్నారు. తల్లీ కూతుళ్ల పోటీ వ్యవహారం మండలంలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి ప్రచారం చూడటానికి ఇతర గ్రామస్తులు కూడా తిమ్మయ్యపల్లెకి క్యూ కడుతున్నారు. కూలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రచారం చేస్తున్నారు. మరి.. ఎన్నికల్లో..ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

