వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొరమీను చేపల పెంపకం రైతులకు లాభదాయకంగా మారింది. హైదరాబాద్ సమీపంలో చిన్న స్థలాల్లోనూ అధిక డిమాండ్ ఉన్న ఈ చేపలను పెంచుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేందుకు ఇది మంచి అవకాశం. కంది మండలంలోని ఆంజనేయులు వంటి రైతులు ఇప్పటికే విజయం సాధించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొరమీను చేపల పెంపకం రైతులను మంచి లాభాలను తెచ్చిపెడుతోంది.హైదరాబాద్ కి దగ్గర్లో ఉండడంతో ఇక్కడ చేపల పెంపకం పెద్ద ఎత్తున్న సాగుతుంది. ఒకప్పుడు చేపల పెంపకం అంటే గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల్లో ఎక్కువగా పెంచే వారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. చాలా మంది రైతులు ఇప్పుడు వారి సొంత పొలంలోనే కొంత స్థలంలో ఇలా కొర్రమీను చేపలను పెంచుతున్నారు..అతి తక్కువ స్థలంలోనే ఇవి పెరుగుతుండటంతో అన్నదాతలు ఆసక్తి చూపిస్తు న్నారు. పోషక విలువలు కలిగి ఉండి, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కొరమీను చేపలను కొద్దిపాటి స్థలంలోనే పెంచవచ్చు. వ్యవసా యానికి అనుబంధంగా రైతులు వీటి పెంపకాన్ని చేపడుతున్నారు.. సంగారెడ్డి జిల్లాలోని ఓ రైతు కొర్రమీను చేపల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని నిరూపించాడు. కంది మండలానికి చెందిన ఆంజనేయులు రెండున్నర ఎకరాల పొలంలో కొర్రమీను చేపలు ఉత్పత్తి చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా చేపల ఉత్పత్తి చేస్తున్నాడు. 6 నెలలకు ఒకసారి క్రాప్ వస్తుందని…కొర్రమీను చేప పిల్లలను ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెంచుతున్నాడు. రెండున్నర ఎకరాల పొలంలో గుంటలు కట్టి చేపలు పెంచడం వల్ల మంచి లాభాలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ కి దగ్గర్లో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, పటాన్ చెర్, జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుతున్నారు..వీటి పెంపకానికి కావాల్సిందల్లా తొట్టెను పెట్టేందుకు చిన్న షెడ్డు, కొలను ఉంటే సరిపోతుంది. వీటి ఏర్పాటుకు ప్రభుత్వాలు కూడా మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఔత్సాహికులకు బ్యాంకు లోన్లు ఇప్పించడంతో పాటు యూనిట్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. కొర్రమీనులో మాత్రం ఫీడ్ సక్రమంగా అందిస్తే తప్పనిసరి లాభాలు సొంతం చేసుకోవచ్చు అని అంటున్నారు రైతులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్.. కన్ను పడిందా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

