ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్.. కన్ను పడిందా
బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బంగారు నగలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర మహిళా దొంగ కావటి లలితను బాపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొల్లు ప్రాంతంలో చోరీలు పెరగడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆమె వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు బస్సుల్లో బంగారు నగలు ధరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
బంగారు నగలు ధరించి బయటకు వెళ్లాలంటే భయపడే రోజులు దాపురించాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఓ వైపు బంగారం రేటు అంతనంత ఎత్తుకు పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలో నగలు చేయించుకునేందుకు ఎవరూ సాహసించడంలేదు. సామాన్యులెవరూ బంగారంవైపు చూడ్డానికి భయపడుతున్నారు. దీంతో తమకు ఉన్న ఒకటీ, అరా నగలే ఫంక్షన్లు, కార్యక్రమాలకు వేసుకొని వెళ్తున్నారు. ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకొని వాటినికూడా దోచేస్తున్నారు దొంగలు. తాజాగా ఓ మహిళ బస్సు ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకొని ఓ ప్యాసింజర్‌లా బస్సు ఎక్కుతూ చోరీలకు పాల్పడుతోంది. విషయం తెలిసిన పోలీసులు పక్కా ప్లాన్‌తో ఆ కిలేడీని పట్టుకొని జైలుకి పంపారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. బాపట్ల జిల్లా ఇంకొల్లు పరిసర ప్రాంతాల్లో బస్టాండ్ ల్లో బంగారు ఆభరణాలు చోరికి గురైన కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో పాత నేరస్థులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కావలికి చెందిన కావటి లలిత పాత నేరస్థురాలిగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె కదలికలు ఇంకొల్లు ప్రాంతంలో ఉన్నట్లుగా తేల్చిన పోలీసులు ఆమె కోసం ప్రత్యేక నిఘా పెట్టారు. స్థానిక బస్టాండ్‌లో మాటు వేసి ఉన్న లలితను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి పదిహేను లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్ ల్లో ప్రయాణీకురాలిగా ఉంటూ చోరీలకు పాల్పడుతున్న లలితపై పశ్చిమ గోదావరి, క్రిష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ అన్ని జిల్లాలో కలిపి పదిహేడు కేసులు నమోదైనట్లు బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాల్లో కూడా చోరిలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఇంకొల్లు పరిసర ప్రాంతాల్లో ఐదు చోరీలు జరగడంతో పాత నేరస్థురాలైన లలితపై నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు. అంతర్ రాష్ట్ర మహిళా దొంగను పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. బంగారు ఆభరణాలు ధరించి బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

