AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score Free: ఫ్రీగా మీ క్రెడిట్ రిపోర్ట్ చూసుకోండి.. బ్యాంకు నుంచి కొత్త వెబ్‌సైట్.. అందరికీ. .

క్రెడిట్ రిపోర్ట్ చూసుకునేందుకు ఆన్‌లైన్‌లో బెల్డెన్నీ వెబ్‌సైట్లు, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో వివరాలు సరిగ్గా ఉండవు. ఫ్రీగా వస్తుందనే కారణంతో మనం పట్టించుకోము. కానీ తాజాగా యస్ బ్యాంక్ క్రెడిట్ స్కోర్ ఫ్రీగా చూసుకునే వెబ్‌సైట్ లాంచ్ చేసింది.

Credit Score Free: ఫ్రీగా మీ క్రెడిట్ రిపోర్ట్ చూసుకోండి.. బ్యాంకు నుంచి కొత్త వెబ్‌సైట్.. అందరికీ. .
క్రెడిట్ వినియోగం: మీ క్రెడిట్ కార్డుపై ఉన్న మొత్తం పరిమితిలో మీరు ఎంత డబ్బును ఉపయోగిస్తున్నారనేది చాలా ముఖ్యం. దీనిని క్రెడిట్ వినియోగ నిష్పత్తి అంటారు. మీరు మీ పరిమితిలో 30శాతం కంటే తక్కువ మాత్రమే ఉపయోగించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు.. మీ క్రెడిట్ పరిమితి రూ.1 లక్ష అయితే మీరు రూ.30,000 కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. తక్కువ వినియోగం అంటే మీరు బాధ్యతాయుతంగా ఖర్చు చేస్తున్నారని రుణదాతలకు చూపిస్తుంది.
Venkatrao Lella
|

Updated on: Dec 05, 2025 | 12:29 PM

Share

Cibil Score: సిబిల్ స్కోర్ ఈ రోజుల్లో ఎంత ప్రధానమైనదనేది మనందరికీ తెలిసిన విషయమే. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు ఏ బ్యాంక్ కూడా డబ్బులు అవసరమైనప్పుడు లోన్ ఇవ్వడానికి ముందుకు రాదు. అందుకే సిబిల్ స్కోర్ అనేది మెరుగ్గా ఉన్నప్పుడే మనం ఆర్ధికంగా బలంగా ఉన్నట్లు లెక్క. సిబిల్ స్కోర్ తగ్గిపోతే పెంచుకోవడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. లోన్లు సమయానికి కట్టడం, క్రెడిట్ కార్డు బిల్లు ముందుగానే చెల్లించడం, లోన్లు, క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసుకోకుండా ఉండటం వల్ల మీ క్రెడిట్ స్కోర్ కొద్ది నెలల్లో మళ్లీ పెరుగుతుంది.

అయితే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి మనకి అనేక ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. సిబిల్ వెబ్‌సైట్‌లోకి నేరుగా వెళ్లి మీరు ఫోన్ నెంబర్, పాన్ కార్డు నెంబర్ లాంటి డీటైల్స్ ఇచ్చి చూసుకోవచ్చు. ఇక అన్ని బ్యాంకులు తమ వెబ్‌సైట్లు, యాప్‌లలో సిబిల్ స్కోర్ ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఇందుకు కొద్ది మొత్తంలో నగదు తీసుకుంటుండగా.. మరికొన్ని బ్యాంకులు ఫ్రీగా సేవలు అందిస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ బ్యాంకు అయిన యస్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఫ్రీగా సిబిల్ స్కోర్ చూసుకునే విధంగా స్కోర్‌క్యాహువా.బ్యాంక్.ఇన్ అనే మైక్రో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీ క్రెడిట్ రిపోర్ట్ మొత్తం ఫ్రీగా చూసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్‌పై అవగాహన పెంచేందుకు, లోన్ల విషయంలో బాధ్యతగా ఉండేందుకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుందన్నారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ వెబ్‌సైట్ తెచ్చినట్లు యస్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ మైక్రో వెబ్‌సైట్‌లో ఇంకా చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సిబిల్ స్కోర్‌పై అపోహలు తొలగించే సమాచారంతో పాటు ఆర్ధిక అంశాలపై కొన్ని వీడియోలు ఉన్నాయి. మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావితం చూపించే అంశాలను దీని ద్వారా మీరు తెలుసుకుని జాగ్రత్త పడొచ్చు.