AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran-US-Israel Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్..

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం దశాబ్దాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాడిని ఇరాన్‌పై ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందారని.. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Iran-US-Israel Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్..
Iran-Israel Tensions
Shaik Madar Saheb
|

Updated on: Mar 01, 2026 | 6:38 AM

Share

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం దశాబ్దాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాడిని ఇరాన్‌పై ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందారని.. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. నేను ప్రజల స్వేచ్ఛను కోరుకుంటున్నా.. నాకు సురక్షితమైన దేశం కావాలి.. అంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు.. అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది.. ఖమేనీ సురక్షితంగా ఉన్నారంటూ పేర్కొంది.

ట్రంప్ పోస్ట్..

ఇరాన్ దాడుల్లో ఖమేనీ మృతిచెందారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజ్‌మెన్ నేతన్యాహు సైతం ప్రకటించారు. ఖమేనీ హతమైనట్టు ఆధారాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ఖమేనీ సురక్షితంగా ఉన్నారు.. ఇరాన్

కాగా.. ఖమేనీ మృతి వార్తలను ఇరాన్‌ ఖండించింది. ఖమేనీ సురక్షితంగా ఉన్నారంటూ ఇరాన్‌ ప్రకటించింది. గల్ఫ్‌లోని 14 అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేశామని.. వందలాది మంది అమెరికా సైనికులను హతమార్చామని తెలిపింది. ఊహించని రీతిలో ముగింపు ఉంటుందంటూ ఇరాన్‌ ప్రకటించింది.

ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు మృతి

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు విరుచుకుపడ్డాయి.. ఇరాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ రక్షణ శాఖలో ఏడుగురు సీనియర్ అధికారులను.. హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.

కాగా.. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు మృతి చెందారని.. ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Follow Us