14 April, 2026
Subhash
ప్రస్తుతం నిత్యవసర వస్తువులతో పాటు ఇతర వస్తువులు కూడా ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ధరలతో సామాన్యులకు భారంగా మారుతోంది.
ఇక ఇంటిని నిర్మించుకోవాలనే కల అందరిలో ఉంటుంది. ఎప్పటికైనా కొత్త ఇంటిని నిర్మించాలనే ఆశలో ఉంటారు. ఇంటి నిర్మాణంలో కూడా బడ్జె్‌ట్ పెరిగిపోతోంది.
తాజాగా సిమెంట్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ఉత్పత్తి సంస్థలు ధరలను పెంచే అవాకశాలున్నాయని తెలుస్తోంది.
సిమెంట్ ఉత్పత్తి సంస్థలు సిమెంట్ బస్తా ధరను 1-3 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది.
అలాగే సిమెంట్‌కు డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజన్సీ క్రిసిల్ వెల్లడించింది.
గత సంవత్సరంతో పోలిస్తే క్రూడాయిల్ ధరలు 46 శాతం పుంజుకోగా, పెట్ కోక్ ధరలు 13 శాతం చొప్పున పెరిగాయి.
గత సంవత్సరంతో పోలిస్తే క్రూడాయిల్ ధరలు 46 శాతం పుంజుకోగా, పెట్ కోక్ ధరలు 13 శాతం చొప్పున పెరిగాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బస్తా సిమెంట్ ధర 355 రూపాయల నుంచి 400 రూపాయల స్థాయిలో ఉన్నది.