AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైఫ్ సైకిల్ ఫండ్ అంటే ఏంటి? కొత్త పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన విషయం

భారత పెట్టుబడి మార్కెట్లో SEBI కీలక సంస్కరణలు చేపట్టింది. మ్యూచువల్ ఫండ్ వర్గీకరణలో భాగంగా, పాత రిటైర్మెంట్, చిల్డ్రన్ ఫండ్‌లను నిలిపివేసి, వాటి స్థానంలో 'లైఫ్ సైకిల్ ఫండ్' అనే ఆధునిక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది లక్ష్య ఆధారిత పెట్టుబడులను సులభతరం చేస్తుంది.

లైఫ్ సైకిల్ ఫండ్ అంటే ఏంటి? కొత్త పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన విషయం
Sebi Mutual Fund Reforms
SN Pasha
|

Updated on: Feb 28, 2026 | 10:46 PM

Share

భారత పెట్టుబడి మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI తాజాగా మ్యూచువల్ ఫండ్ వర్గీకరణలో పెద్ద సంస్కరణలు చేపట్టింది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ నిధులు, పిల్లల నిధులు వంటి కొన్ని పాత వర్గాలను మూసివేసి, వాటి స్థానంలో ‘లైఫ్ సైకిల్ ఫండ్’ అనే ఆధునిక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ అండ్‌ సీఈఓ రాధికా గుప్తా ఈ నిర్ణయాన్ని భారత ఆస్తి నిర్వహణ రంగానికి “నిర్ణయాత్మక మార్పు”గా అభివర్ణించారు. ఆమె ప్రకారం ఇది లక్ష్య ఆధారిత పెట్టుబడులను మరింత సులభతరం చేస్తుంది.

లైఫ్ సైకిల్ ఫండ్ ఎలా పనిచేస్తుంది?

  • లైఫ్ సైకిల్ ఫండ్ అనేది ముందుగా నిర్ణయించిన కాలవ్యవధి (టార్గెట్ డేట్) ఉన్న ఓపెన్-ఎండ్ మ్యూచువల్ ఫండ్. దీనిలో ముఖ్యమైన కాన్సెప్ట్ గ్లైడ్ పాత్
  • ప్రారంభ దశలో ఫండ్ ఎక్కువగా ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతుంది. దీని వల్ల అధిక వృద్ధి అవకాశాలు ఉంటాయి.
  • కాలం గడిచేకొద్దీ, ముఖ్యంగా లక్ష్య తేదీ దగ్గరపడుతున్నప్పుడు, ఫండ్ ఆటోమేటిక్‌గా డెట్ వంటి సురక్షిత ఆస్తుల వైపు మారుతుంది.
  • పెట్టుబడిదారుడు స్వయంగా పోర్ట్‌ఫోలియో మార్చాల్సిన అవసరం ఉండదు.
  • యువకుడిగా మీరు ఎక్కువ రిస్క్ తీసుకునేలా, వృద్ధాప్యంలో భద్రత పెరిగేలా ఈ ఫండ్ స్వయంగా సమతుల్యం చేసుకుంటుంది.

పాత ఫండ్లు ఎందుకు నిలిపివేశారు?

  • SEBI ఉద్దేశం మ్యూచువల్ ఫండ్ వర్గాలను సరళీకృతం చేయడం పెట్టుబడిదారుల గందరగోళాన్ని తగ్గించడం.
  • రిటైర్మెంట్, చిల్డ్రన్ ఫండ్లలో కొత్త పెట్టుబడులు నిలిపివేశారు.
  • ఉన్న పథకాలను సమాన స్వభావం గల ఇతర పథకాలతో విలీనం చేస్తారు.
  • ఉత్పత్తి పేరు, లక్ష్యం మధ్య స్పష్టత ఉండేలా నిబంధనలు కఠినతరం చేశారు.

లైఫ్ సైకిల్ ఫండ్ ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. ఆటోమేటిక్ ఆస్తి కేటాయింపు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో అంచనా వేయాల్సిన అవసరం లేకుండా, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇది సౌకర్యవంతమైన మార్గంగా నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాల లక్ష్యాలతో (రిటైర్మెంట్, పిల్లల విద్య) పెట్టుబడి పెట్టేవారికి లైఫ్ సైకిల్ ఫండ్లు ఒక స్మార్ట్, క్రమశిక్షణ గల పెట్టుబడి సాధనంగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us