Malavya Yoga: రాసిపెట్టుకోండి.. ఇక ఆ రాశుల దశ తిరగడం ఖాయం..!
Malavya Yoga: పంచ మహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య యోగం ఈ నెల ప్రత్యేకంగా ప్రభావం చూపుతోంది. ఏప్రిల్ 20 నుంచి శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ శుభయోగం ఏర్పడింది. దీంతో వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారికి సుఖసంతోషాలు, సంపద, ప్రేమ, వివాహ యోగాలు మెరుగుపడే అవకాశం ఉంది. మే 14 వరకు ఈ యోగ ప్రభావం కొనసాగి, కోరుకున్న లక్ష్యాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి.

Malavya Yoga
పంచ మహా పురుష యోగాల్లో మాలవ్య మహా పురుష యోగం ఒకటి. శుక్రుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, సిరిసంపదలు, ప్రేమలు, పెళ్లిళ్లు, కళలు, దాంపత్య జీవితం వంటి వాటికి కారకుడైన శుక్రుడు ఈ నెల(ఏప్రిల్) 20 నుంచి తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ మహా పురుష యోగం ఏర్పడింది. ఈ యోగం పట్టిన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులవారు తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయి చేరుకోవడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి. మే 14 వరకు శుక్రుడు వృషభంలో కొనసాగుతాడు.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీని ఫలితంగా వీరు ఒక 35 రోజుల పాటు రాజయోగాలు, ధన యోగాలు అనుభవించడం జరుగుతుంది. చీకూ చింతాలేని జీవితం గడిపే అవకాశం ఉంది. ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఏ రంగంలో ఉన్నా ఉచ్ఛ స్థితికి చేరుకుంటారు. కళారంగంలో ఉన్నవారు బాగా రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్నులయ్యే సూచనలున్నాయి.
- సింహం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఈ మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల సామాజికంగా, ప్రభుత్వపరంగా కూడా గుర్తింపు లభిస్తుంది. ఏ రంగంలో ఉన్నా పదోన్నతులు కలగడం, జీతభత్యాలు అంచనాలను మించి పెరగడం జరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి సంపన్నుడయ్యే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగింది. ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాలు విజయవంతంగా సాగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కనక వర్షం కురిపిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది.
- కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మాలవ్య యోగం కలిగింది. దీనివల్ల కుటుం బంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక స్థిరత్వం, భద్రత లభిస్తాయి.
Follow Us