Watch Video: టోల్‌గేట్ దాటుతుండగా కారుపై పడిపోయిన సిమెంట్ ట్యాంకర్.. ఇదిగో వీడియో
ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌గేట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతున్న క్రమంలో ఓ సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న కారుపై పడిపోయింది. భారీగా ఉన్న ట్యాంకర్ మీద పడడంతో కారు నుజ్జునుజ్జు అయింది. వెంటనే అలర్ట్ అయిన టోల్ సిబ్బంది ట్యాంకర్‌ను తొలగించే ప్రయత్నంలో ఉన్నారు.

ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న ఓ బారీ సిమెంట్ ట్యాంక్ టోల్‌గేట్ దాటే క్రమంలో అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఓ కారుపై పడిపోయింది. హెవీ లారీ పడడంతో కారు మొత్తం నుజ్జునుజ్జయింది. ప్రమాదాన్ని గమనించిన టోల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ట్యాంకర్‌ను కారు పై నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేపాట్టారు.
సరిగ్గా టోల్‌గేట్ వద్ద ప్రమాదం జరగడంలో టోల్ ప్లాజా సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంకర్‌లో లోడ్ ఉండడంతో ట్యాంకర్ తొలగించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. వాళ్ల పరిస్థితి ఏంటో అనేది ఇంకా తెలియదు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
