తెలంగాణాలోని మగవారిలో కొత్త టెన్షన్.. దేశంలో ఇక్కడే ఆ సమస్య ఎక్కువ!
తెలంగాణలో పురుషుల జీర్ణ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని తాజా సర్వే వెల్లడించింది. గట్ హెల్త్ బలహీనపడటంతో జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, పని ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం వంటి అలవాట్లు ప్రధాన కారణాలుగా గుర్తించారు. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల యువతలో హెయిర్ ఫాల్ సమస్య అధికంగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది.
తెలంగాణలోని పురుషులలో జీర్ణ సంబంధిత ఆరోగ్యం వేగంగా తగ్గుతోందని, ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా దేశంలో ఇక్కడే ఎక్కువని తాజా అధ్యయనంలో బయటపడింది. ఓ హెయిర్ కేర్ బ్రాండ్ చేసిన “జాతీయ గట్-హెయిర్ హెల్త్” సర్వే ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా లక్షా 60 వేల మంది పురుషులపై అధ్యయనం చేసారు. తెలంగాణలో మంచి జీర్ణ ఆరోగ్యం ఉన్న పురుషుల సంఖ్య 2024లో 19 శాతం ఉండగా, 2025 నాటికి అది 15 శాతానికి పడిపోయింది. ఈ 4 శాతం క్షీణత దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం. తెలంగాణ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, ఢిల్లీ ఉన్నాయి. పట్టణీకరణ, ఐటీ రంగం ప్రభావంతో మారిన జీవనశైలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తినడం, పని ఒత్తిడితో సమయానికి భోజనం చేయకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం వంటివి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని తెలిపింది. జీర్ణ వ్యవస్థ బలహీనపడటంతో శరీరానికి, జుట్టు కుదుళ్లకు అవసరమైన ఐరన్, జింక్, విటమిన్ల వంటి పోషకాలు అందవు. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సమస్యను కేవలం షాంపూలు, నూనెలతో పరిష్కరించలేమని, జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది ఒత్తిడి, పని భారం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్ల కారణంగా ముందుగానే జుట్టు కోల్పోతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో రూపురేఖలపై ఎక్కువ శ్రద్ధ పెరగడంతో, జుట్టు రాలడం యువతలో ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిపుణుల సూచనల ప్రకారం రోజూ సమయానికి భోజనం చేయడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించడం ద్వారా గట్ హెల్త్‌ను మెరుగుపరచవచ్చు. అలాగే సరిపడా నిద్ర, యోగా, ధ్యానం, తాజా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా నిపుణుల సలహాతోనే డైట్ ని ప్లాన్ చేసుకోవాలని మాత్రం మర్చిపోకండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మధురఫలం.. విషపూరితం.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు
డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు
ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!
Air India: విమాన ప్రయాణికులకు షాక్.. 1,200 విమానాలు రద్దు
ఇంట్లో బంగారం దాచుకున్న వారికి బంపర్ ఆఫర్.. 10 గ్రాములున్నా లాభమే
ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతీ రాత్రి ఉరుములు మెరుపులే
డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు
ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!
అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో
వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??
రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు
బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్

