విజయనగరం జిల్లా మద్దివలస పంటపొలాల్లో మూడు పాములు సుమారు గంటపాటు పెనవేసుకుని సయ్యాట ఆడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ అరుదైన దృశ్యం మొదట రైతులను భయపెట్టినా, తరువాత గ్రామస్తులు ఆసక్తిగా వీక్షించారు. అయితే, ఇటీవల గ్రామ పరిసరాల్లో తరచుగా పెద్ద పాముల సంచారం పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.