ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతీ రాత్రి ఉరుములు మెరుపులే
వెనెజువెలాలోని మారకైబో సరస్సు ప్రపంచంలోనే అత్యధిక మెరుపులు నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందింది. నాసా విడుదల చేసిన తాజా లైట్నింగ్ మ్యాప్స్ ప్రకారం, ఇక్కడ రాత్రివేళ దాదాపు నిరంతరం మెరుపులు సంభవిస్తుంటాయి. ‘కటటుంబో లైట్నింగ్’గా ప్రసిద్ధి చెందిన ఈ అద్భుత సహజ సంఘటన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. శాస్త్రవేత్తలు దీనిని భూమిపై సహజ విద్యుత్ ప్రయోగశాలగా అభివర్ణిస్తున్నారు.
సాధారణంగా వర్షం పడినప్పుడు మాత్రమే ఉరుములు, మెరుపులు వస్తాయి. కానీ ప్రపంచంలో రోజూ ఉరుములు, మెరుపులు ఏర్పడే ప్రాంతం ఉందని మీకు తెలుసా? అదే.. వెనెజువెలాలోని మారకైబో సరస్సు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసిన సరికొత్త లైట్నింగ్ మ్యాప్స్ ప్రకారం, ఈ సరస్సు ప్రపంచంలోనే అత్యధిక మెరుపులు నమోదయ్యే ‘లైట్నింగ్ హాట్‌స్పాట్’గా గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇక్కడ రాత్రి సమయంలో దాదాపు నిరంతరం మెరుపులు సంభవిస్తూనే ఉంటాయి. ఈ అద్భుతమైన సహజ సంఘటనను “కటటుంబో లైట్నింగ్” అని పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యాన్ని స్థానికంగా ‘కటటుంబో లైట్నింగ్’ అని పిలుస్తారు. ఇక్కడ రాత్రి మొదలైందంటే చాలు, గంటకు వందల సార్లు మెరుపులు మెరుస్తూనే ఉంటాయి. గతంలో ఆఫ్రికాలోని కాంగో ప్రాంతం మొదటి స్థానంలో ఉండగా, నాసా శాస్త్రవేత్తలు అధునాతన శాటిలైట్ సెన్సార్లతో పరిశోధించి మారకైబో సరస్సును నంబర్ వన్‌గా గుర్తించారు. మారకైబో సరస్సు చుట్టూ ఉన్న పర్వతాల నుండి రాత్రివేళ వీచే చల్లని గాలులు, సరస్సు పైనున్న వేడి, తేమ గాలిని పైకి నెట్టడం వల్ల భారీ మేఘాలు ఏర్పడతాయి. ఘర్షణ తీవ్రంగా ఉండడం వల్ల, నిరంతరాయంగా మెరుపులు పుడతాయి. శాస్త్రవేత్తల భాషలో చెప్పాలంటే, ఇది భూమిపై ఉన్న ఒక అద్భుతమైన ‘సహజ విద్యుత్ ప్రయోగశాల’. స్థానికులకు ఇది నిత్యం జరిగే వేడుక అయితే, ప్రపంచానికి మాత్రం ఇదొక అంతుచిక్కని వింత.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయాన్నే ఓ గ్లాస్ తాగితే చాలు
తెలంగాణాలోని మగవారిలో కొత్త టెన్షన్.. దేశంలో ఇక్కడే ఆ సమస్య ఎక్కువ!
మధురఫలం.. విషపూరితం.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు
ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతీ రాత్రి ఉరుములు మెరుపులే
డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు
ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!
అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో
వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??
రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు
బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్

