AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇంటర్ పరీక్షలో 5 మార్కులతో సబ్టెక్ట్ ఫెయిల్.. రీ వాల్యువేషన్ పెట్టగా అందరూ షాక్..

ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్‌గా ప్రకటించిన గుంటూరు విద్యార్థిని కావ్యకు రీవాల్యుయేషన్ తర్వాత బోటనీలో ఏకంగా 60కు 60 మార్కులు రావడం సంచలనంగా మారింది. మొదట 5 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిల్ అయిన ఆమె, రీవాల్యుయేషన్‌తో ఉత్తీర్ణత సాధించారు. .. ..

Andhra: ఇంటర్ పరీక్షలో 5 మార్కులతో సబ్టెక్ట్ ఫెయిల్.. రీ వాల్యువేషన్ పెట్టగా అందరూ షాక్..
Inter Revaluation
Ram Naramaneni
|

Updated on: May 15, 2026 | 10:20 AM

Share

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట ఫెయిల్‌గా ప్రకటించిన ఓ విద్యార్థినికి రీవాల్యుయేషన్ తర్వాత ఏకంగా 60కు 60 మార్కులు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఈ విద్యార్థిని విషయంలో జరిగిన పొరపాటు విద్యా వ్యవస్థలో మూల్యాంకన ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 15న విడుదలైన రిజల్ట్స్‌లో ఆమెకు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి. అయితే బోటనీ సబ్జెక్ట్‌లో మాత్రం కేవలం 5 మార్కులు మాత్రమే రావడంతో ఆమె ఫెయిల్ అయినట్లు ఫలితాల్లో చూపించారు.

తాను పరీక్ష బాగా రాసిన నమ్మకం కావ్యకు ఉండటంతో ఈ ఫలితాన్ని ఆమె నమ్మలేకపోయారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల సహకారంతో వెంటనే రీవాల్యుయేషన్‌కు అప్లై చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు నుంచి ఆన్సర్ షీట్‌తో పాటు రీవాల్యుయేషన్ వివరాలు విడుదలయ్యాయి.

రివాల్యుయేషన్ ఫలితాలు చూసిన కావ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే బోటనీలో ఆమెకు ఏకంగా 60కు 60 మార్కులు వచ్చాయి. ఆన్సర్ షీట్ పరిశీలనలో ప్రతి ప్రశ్నకు పూర్తి మార్కులు నమోదైనట్లు వెల్లడైంది. ఓఎంఆర్ షీట్‌లో కూడా 60 మార్కులే నమోదు చేసినట్లు సమాచారం.

దీంతో మార్కుల బబ్లింగ్ సమయంలోనో, కంప్యూటర్‌లో మార్కులు ఎంటర్ చేసే సమయంలోనో పొరపాటు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట 5 మార్కులతో ఫెయిల్‌గా ప్రకటించి, తర్వాత రీవాల్యుయేషన్‌లో పూర్తి మార్కులు రావడం తీవ్ర చర్చకు దారి తీసింది.

“ఒకవేళ ఆ విద్యార్థిని ఫెయిల్ అయ్యాననే బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఉండి ఉంటే పరిస్థితి ఏంటి?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కావ్య పాస్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన మూల్యాంకన విధానంలో మరింత జాగ్రత్త అవసరాన్ని గుర్తుచేస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us