AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

65 ప్లస్‌లో కుర్ర హీరోలకు సవాల్

65 ప్లస్‌లో కుర్ర హీరోలకు సవాల్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 14, 2026 | 8:49 PM

Share

40 ఏళ్లు దాటితేనే చాలామందికి ఆరోగ్య సమస్యలు మొదలవుతున్న ఈ రోజుల్లో టాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం తమ ఫిట్‌నెస్‌తో కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లుక్‌లు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. క్రమశిక్షణతో కూడిన డైట్, వర్కౌట్స్, మేకోవర్‌లతో వయసును మరిచిపోయేలా కనిపిస్తున్న ఈ స్టార్ హీరోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

40 దాటితేనే నడుము నొప్పులు వచ్చేస్తున్న ఈ సమయంలో.. మన సీనియర్ హీరోలు మాత్రం కుర్రాళ్లకు కూడా కుళ్లు తెప్పిస్తున్నారు. వాళ్ల మేకోవర్, ఫిట్ నెస్ అండ్ గ్లామర్ చూస్తుంటే ముక్కున వేలేసుకోక తప్పదు. సూపర్ మెయింటనెన్స్‌తో వయసును సగానికి సగం తగ్గించుకుంటున్నారు. మరి సీనియర్స్ చేస్తున్న ఆ మాయేంటి.. వాళ్ల ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటి..? చూస్తున్నారుగా చిరంజీవి కొత్త ఫోటోషూట్.. ఈ ఫోటోలు చూసాక ఆయనకు 70 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి..? అంతగా మేకోవర్ అయిపోయారు మెగాస్టార్. రెండేళ్లుగా ఫిట్ నెస్ మీద మరింత ఫోకస్ చేసారు చిరు. ఆ మధ్య మన శంకరవరప్రసాద్ గారు కోసం 14 కేజీలకు పైగా బరువు తగ్గారు. తాజాగా బాబీ కోసం మరింత కొత్తగా మారిపోతున్నారు. లుక్ అండ్ ఫిట్ నెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు చిరంజీవి. క్రమం తప్పకుండా జిమ్ చేయడం, ఫుడ్ డైట్‌తో కుర్రాడిలా మారిపోయారు. కేవలం చిరు మాత్రమే కాదు.. ఫిట్ నెస్ విషయంలో నాగార్జున కూడా అంతే. ఈయన తన 100వ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు. ఆ మధ్య కూలీలోనూ నాగ్ లుక్ బాగా వైరల్ అయింది. బాలయ్య సైతం లుక్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. అఖండ 2లో రెండు పాత్రల కోసం బాగా మేకోవర్ అయిన ఈయన.. తాజాగా గోపీచంద్ మలినేని సినిమా కోసం బరువు తగ్గారు. మాసీ లుక్‌లో ఒకప్పటి బాలయ్యను గుర్తు చేస్తున్నారు. ఇక వెంకీ కూడా పర్ఫెక్ట్ లుక్ మెయింటేన్ చేస్తున్నారు. ఆదర్శ కుటుంబంలో వెంకీ వయసు 20 ఏళ్లు చిన్నగా కనిపిస్తుంది. మొత్తానికి మన సీనియర్లు అలా మాయ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Vijay: 0277′ విజయ్‌ కారు నెంబర్ వెనుక గుండెలు పిండేసే కథ

స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త

Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??

రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు

Follow Us